భారీ బడ్జెట్లతో యువి క్రియేషన్స్ సాహసం గురించి తెలిసిందే. ఓవైపు ప్రభాస్ నటించిన గత చిత్రం `సాహో` ఫలితం నిరాశపరిచినా రాధేశ్యామ్ కోసం యువి బ్యానర్ రాజీకి రాకుండా పెట్టుబడుల్ని సమకూర్చడం ఇండస్ట్రీలో చర్చకు వచ్చింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో పలుమార్లు కరోనా మహమ్మారీ ప్రవేశం తీవ్ర ఆటంకాలు కలిగించింది. సినిమా బడ్జెట్ అమాంతం పెరిగేందుకు ఇది కారణమైంది. ఆర్టిస్టుల కాల్షీట్ల సమస్య సహా విదేశీ ప్రయాణాలతో చాలా కఠోరంగా శ్రమించాల్సి వచ్చింది. అయినా దేనికీ వెరవక యువి సంస్థ బడ్జెట్లను వెచ్చించింది.
ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ చివరి అంకంలో ఉంది. ప్రస్తుతం ఎండ్ టైటిల్ కార్డ్స్ వేసేందుకు ఓ పాటను చిత్రీకరించేందుకు ఏకంగా మూడు భారీ సెట్లు వేశారని తెలిసింది. చిత్రీకరణకు ప్రధాన నటుల అవసరం లేకుండా కేవలం టైటిల్ కార్డ్స్ కోసం ఈ షూట్ ని చేస్తున్నారని టాక్. గండికోట పరిసరాల్లో భారీ సెట్లు వేస్తున్నారు. సెట్లు రెడీ కాగానే చిత్రీకరణను చేయనున్నారు. 3రోజుల పాటు సాగే ఈ చిత్రీకరణతో మొత్తం షూటింగ్ పూర్తయినట్టేనని తెలిసింది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
రాధేశ్యామ్ స్టోరి ఆద్యంతం ఆసక్తికరం..
`రాధేశ్యామ్` పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా రిలీజ్ కి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. 2022 సంక్రాంతికి ఈ సినిమా రిలీజవుతుంది. 1980లలో యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరి మెస్మరైజ్ చేయనుందని ఇప్పటికే రివీల్ అయింది. ఆ కాలం నాటి సెట్లు నిర్మించి యాక్షన్ సన్నివేశాల్ని అంతే హైలైట్ గా తెరకెక్కించారు.
ఇప్పటికే ఈ సినిమా కథాంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇది టైమ్ ట్రావెల్ నేపథ్యంలోని మూవీ అని ..ప్రతీ సన్నివేశం ఆద్యంతం ఆసక్తికరంగా ట్విస్టులతో ఎంతో అందంగా మలుస్తున్నట్లు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ సన్నివేశాలు ఎక్కువగా ఆ కాలం నాటి రిచ్ యూరోపియన్ స్టైల్ రన్నింగ్ ట్రైన్ లో చిత్రీకరించారని..సినిమాలో ట్రైన్ లో లవ్ ఎపిసోడ్స్ ఎంతో అందంగా కనిపిస్తాయని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ లోనే ఓ రైల్వేస్టేషన్ చూపించారు. కొత్త పోస్టర్ లో నాయకానాయికలు ట్రెయిన్ లోనే విరహా గీతం పాడటం కనిపించింది.
ఇందులో ప్రభాస్ 1980 కాలం నాటి వింటేజ్ కార్ల డీలర్ పాత్రలో కనిపించనున్నారు. క్యారెక్టరైజేషన్ లో సీరియస్ నెస్ తో పాటు ఫన్ ఎలిమెంట్ అంతే హైలైట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇంకా అతని పాత్రలో చాలా వేరియషన్స్ ఉంటాయని... పూజా హెగ్డే రోల్ మాత్రం చాలా సెటిల్డ్ గా సాగిపోతుందని గుసగుస వినిపిస్తోంది.
క్షణమైనా తీరిక లేకుండా బిజీ
రాధేశ్యామ్ చిత్రీకరణ ముగించాక ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓం రౌత్- ఆదిపురుష్ 3డి.. ప్రశాంత్ నీల్- సలార్ చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటితో పాటు నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ ఇటీవల లాంచ్ అయ్యింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ - దీపిక పదుకొనే వంటి టాప్ స్టార్లు నటిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారీ కాన్వాసుతో దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో అశ్వనిదత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
అలాగే వార్ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రానికి ప్రభాస్ సంతకం చేశారని గుసగుసలు వేడెక్కిస్తున్నాయి. అలాగే యష్ రాజ్ ఫిలింస్ ధూమ్ 4 కోసం ప్రభాస్ ని సంప్రదించిందని మీడియాలో గుసగుసలు వినిపించాయి.