ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన యూవీ క్రియేషన్స్ విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తూ దూసుకుపోతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సన్నిహితులైన ఉప్పలపాటి ప్రమోద్ మరియు వంశీ కృష్ణలు కలిసి ఈ నిర్మాణ సంస్థని నిర్వహిస్తున్నారు. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా తీస్తూ బ్యాలెన్సుడుగా వెళ్తున్నాడు. ఇండస్ట్రీకి కొత్త డైరెక్టర్స్ ని పరిచయం చేయడంలో కూడా ఈ నిర్మాణ సంస్థ ఎప్పుడూ ముందే ఉంటుంది. ప్రభాస్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన 'మిర్చి' సినిమాతో ప్రొడక్షన్ లోకి దిగిన యూవీ క్రియేషన్స్.. వరుస సినిమాలని లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ తో పాన్ ఇండియా లెవల్లో 'రాధే శ్యామ్' అనే పీరియాడికల్ మూవీని రూపొందిస్తున్నారు.
'రాధే శ్యామ్' సినిమా తర్వాత యూవీ క్రియేషన్స్ వారు ఏకంగా ఆరు సినిమాలు లైన్ లో పెట్టారని తెలుస్తోంది. అయితే ఇవన్నీ మీడియం మరియు చిన్న బడ్జెట్ సినిమాలు అని టాక్ నడుస్తోంది. వాస్తవానికి 'మిర్చి' సినిమా తరువాత యూవీ వారు ఎక్కువగా చిన్న, మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు చేద్దామనే అనుకున్నారట. కాకపోతే 'బాహుబలి' సినిమాలతో ప్రభాస్ కి ఒక్కసారిగా క్రేజ్ రావడంతో వెంటనే 'సాహో' చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తీయాల్సి వచ్చింది. ఇప్పుడు 'రాధే శ్యామ్' తర్వాత మాత్రం న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాలు చేయాలని యూవీ టీమ్ నిర్ణయించుకున్నట్లుగా సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.