సినిమా రంగంలో అత్యంత రిస్కుతో కూడుకున్నది నిర్మాణమే. ఓ సినిమా ఫ్లాపైతే అందరూ బాగానే ఉంటారు కానీ.. మునిగేది నిర్మాతే. ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువన్న సంగతి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సంస్థ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడం.. నిర్మించిన నాలుగు సినిమాలతోనూ విజయాలందుకోవడమంటే చిన్న విషయం కాదు. యువి క్రియేషన్స్ వాళ్లు ఈ ఘనత దక్కించుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న ప్రభాస్ మిత్రులు ప్రమోద్, వంశీ కలిసి ఆరంభించిన సంస్థ ఇది. ఇప్పటిదాకా ఈ సంస్థ పట్టిందల్లా బంగారమే అయింది. మిర్చి, రన్ రాజా రన్, జిల్ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన యువి క్రియేషన్స్.. తాజాగా భలే భలే మగాడివోయ్ తో మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. యువి వాళ్లు తమిళంలో డిస్ట్రిబ్యూట్ చేసిన ‘బాహుబలి’ కూడా ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే.
యువి క్రియేషన్స్ సంస్థకున్న మరో గొప్ప ట్రాక్ రికార్డు ఏంటంటే.. ఆ సంస్థలో చేసిన హీరో కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్నందుకుంటాడు. ‘జిల్’ సినిమాతో గోపీచంద్ మాత్రం ఈ ఫీట్ అందుకోలేకపోయాడు కానీ.. మిగతా ముగ్గురు హీరోలు తమ రేంజికి మించిన హిట్టు అందుకున్నారు. యువి వాళ్ల తొలి సినిమా ‘మిర్చి’ ప్రభాస్ కెరీర్ లో అతి పెద్ద విజయం అన్న సంగతి తెలిసిందే. అప్పటికి ప్రభాస్ కూడా ఊహించని స్థాయిలో ఈ సినిమా వసూళ్లు రాబట్టింది. తొలిసారి ప్రభాస్ రూ.40 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ‘రన్ రాజా రన్’తో శర్వానంద్ కెరీర్ బెస్ట్ హిట్టు కొట్టాడు. అతడికా సినిమాను తొలి కమర్షియల్ సక్సెస్. రూ.15 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది ‘రన్ రాజా రన్’. ఇక ‘భలే భలే మగాడివోయ్’ సంగతి చెప్పాల్సిన పని లేదు. తొలి వీకెండ్ లోనే పది కోట్ల దాకా వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటికే నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిపోయింది. ఫుల్ రన్ లో ఈ సినిమా పాతిక కోట్ల దాకా వసూలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మొత్తానికి కెరీర్ బెస్ట్ హిట్టు కొట్టాలనుకునే ఏ హీరో అయినా ఇక ‘యువి క్రియేషన్స్’ని నమ్ముకుంటే బెటరేమో.