విశాఖ వాసి చేతిలోకి ఫిలింఛాంబ‌ర్‌

Update: 2018-07-28 06:46 GMT
గ‌త కొంత‌కాలంగా ఫిలింఛాంబ‌ర్ ఎన్నిక‌ల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఫిలింఛాంబ‌ర్ అధ్య‌క్షుడిగా విశాఖ వాసి - నిర్మాత వి.వీరినాయుడు ఎన్నిక‌య్యారు. ఆ మేర‌కు ఛాంబ‌ర్ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగులో ఏక‌గ్రీవ ఎంపికపై ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. 39వ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగులో వీరినాయుడిని ఏక‌గ్రీవ అధ్య‌క్షునిగా ఎంపిక చేస్తూ మెంబ‌ర్స్ నిర్ణ‌యం తీసుకున్నారు. నేటి  నుంచి ఆయ‌న కొత్త అధ్య‌క్షునిగా ఛార్జ్ తీసుకోనున్నారు. ఫిలింఛాంబ‌ర్ ఉపాధ్య‌క్షుడిగా వి.సాగ‌ర్‌ ని ఎంపిక చేశారు. ఇక‌పోతే ఇప్ప‌టికే పాత క‌మిటీలో కె.బ‌సిరెడ్డి - ఉత్త‌వ‌ర‌పు శ్రీ‌నివాస బాబు ఫిలించాంబ‌ర్ ఉపాధ్య‌క్షులుగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. గౌర‌వ కార్య‌ద‌ర్శులుగా ముత్యాల రామ‌దాసు - కె.శివ‌ప్ర‌సాద‌రావు కొన‌సాగుతున్నారు. గౌర‌వ ఉప‌కార్య‌ద‌ర్శులుగా మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల‌ - వి.రామ‌కృష్ణ‌ - ఎం.సుధాక‌ర్ - జె.మోహ‌న్‌ రెడ్డి - పేర్ల సాంబ మూర్తి - ఎన్‌.నాగ‌రాజు - ట్రెజ‌ర‌ర్‌ గా టి.రామ‌స‌త్య‌నారాయ‌ణ పాత క‌మిటీలో కొన‌సాగారు.

ఇక నిర్మాత‌ల సెక్టార్ కౌన్సిల్ ఛైర్మ‌న్‌ గా వ‌ల్లూరిప‌ల్లి ర‌మేష్‌ బాబు - స్టూడియోస్ సెక్టార్ కౌన్సిల్ అధ్య‌క్షునిగా వై.సుప్రియ‌ - డిస్ట్రిబ్యూట‌ర్ సెక్టార్ కౌన్సిల్ ఛైర్మ‌న్‌ గా వి.నాగేశ్వ‌ర‌రావు - ఎగ్జిబిట‌ర్ సెక్టార్ కౌన్సిల్ ఛైర్మ‌న్‌ గా జి.వీర‌నారాయ‌ణ బాబు కొన‌సాగుతున్నారు. ఆ మేర‌కు అధికారిక ప్రెస్‌ నోట్‌ ని రిలీజ్ చేశారు. అయితే ఫిలింఛాంబ‌ర్ అధ్య‌క్షుడిగా ఎంపికైన విశాఖ వాసి వీరినాయుడు టాలీవుడ్ ని విశాఖ‌కు తీసుకెళ‌తారా.. లేదా? అన్న‌దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. జ‌స్ట్ వెయిట్!!
Tags:    

Similar News