ఫోటో స్టొరీ: బీచ్ లో బికినీ ఏంజెల్

Update: 2019-08-01 17:09 GMT
బాలీవుడ్ లో కోకొల్లలుగా ఉన్న హాటు భామలలో వాణి కపూర్ ఒకరు.  'శుద్ద్ దేశి రొమాన్స్'..  'బేఫిక్రే' లాంటి సినిమాలలో ఘాటుగా నటించి లెక్కలేనన్ని లిప్పులాకులతో బోల్డ్ భామ ట్యాగ్ ను సాధించింది.  ఈ భామ తెలుగులో కూడా ఒక సినిమాలో నటించింది.  అదే నాని హీరోగా నటించిన సినిమా 'ఆహా కళ్యాణం'.  ఈ భామ సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేస్తే చాలు నెటిజన్లు షేక్ కావాల్సిందే.  

తాజాగా ఈ భామ మరోసారి తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు "నాకు బెస్ట్ ట్రైనర్ గా ఉన్నందుకు.. మంచి ఫ్రెండ్ గా ఉన్నందుకు లవ్ యు యాస్మిన్ కరాచీవాలా.  నాలోని బెస్ట్ వెర్షన్ ను బైటకు తీసుకొచ్చేలా నన్ను కష్టపెట్టి మరీ ఎక్సర్ సైజులు చేయించినందుకు థ్యాంక్ యూ.   పది వారాల పాటు పైలేట్స్ నుండి ఫంక్షనల్ వరకూ ఇంటెన్స్ గా ఉండే  ట్రైనింగ్...  చేస్తేనే ఇలాంటి బాడీ వచ్చింది" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ ఫోటోలో పింక్ బికినీ ధరించి తన తడి జుట్టును సవరించుకుంటూ ఒక బ్యూటిఫుల్ బీచ్  లొకేషన్ లో ఫోటోలకు పోజిచ్చింది.  బికినీలు చాలామందే వేసుకుంటారు కానీ ఇది మాత్రం ది బెస్ట్ బికినీ పిక్ అని చెప్పవచ్చు.  బ్యూటిఫుల్ డిజైన్ ఉన్న బికినీతో.. ఖజురహో శిల్పం లాంటి బాడీతో.. కంటికి కనిపించని నెటిజన్లతో యుద్ధం ప్రకటించినట్టుగా ఉంది.

ఈ ఫోటోకు మరో బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి.. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా లైక్స్ కొట్టారు.  టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా ఫైర్ ఎమోజీలతో ఒక కామెంట్ పెట్టింది. సాధారణ నెటిజన్లు కూడా వెర్రెత్తిపోయి మరీ కామెంట్లు పెట్టారు. "ఏక్ దమ్ ఝకాస్ బికినీ"..  "యు ఆర్ జస్ట్ కిల్లింగ్".. "బీచ్ లో బికినీ ఏంజెల్".. "స్టన్నింగ్ బ్యూటీ" అంటూ పొగడ్తలు కురిపించారు.  ఇక సినిమాల విషయానికి వస్తే వాణి ప్రస్తుతం హృతిక్ రోషన్.. టైగర్ ష్రాఫ్ ల మల్టి స్టారర్ చిత్రం 'వార్' లో హీరోయిన్ గా నటిస్తోంది.  
 
Tags:    

Similar News