సొగ‌స‌రి టోన్డ్ లెగ్స్ సొగ‌సు చూడ‌త‌ర‌మా?

Update: 2022-03-11 01:30 GMT
మేడ మీద చ‌ల్ల గాలుల్ని పీల్చాల‌న్నా.. గార్డెనింగ్ చేయాల‌న్నా .. కొంద‌రికి చాలా మ‌క్కువ‌గా ఉంటుంది. కానీ ఇక్క‌డ ఈ అందాల ర‌స‌గుల్ల ఏం చేస్తోందో చూశారుగా.. అలా చైర్ పై కాలు మీద కాలు వేసుకుని కూచుని చిద్విలాసంగా క‌నిపిస్తోంది.

కామ్ గా సంతోషంగా.. బ్రీజ్ (చ‌ల్ల‌ని గాలి)ని ఆస్వాధిస్తున్నాన‌ని చెప్పింది వాణీ. చండీఘ‌ర్ లో ఉద‌యం పూట ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కూడా వెల్ల‌డించింది. ఇక వాణీ పూర్తిగా బాట‌మ్ లెస్ ఫోజుతో అద‌ర‌గొట్టింది. ముఖ్యంగా త‌న టోన్డ్ లెగ్స్ ని హైలైట్ చేస్తూ ఈ భంగిమ‌తో వేడెక్కించింద‌నే చెప్పాలి. మైండ్ బ్లాక్ చేసే ఫోజులు వాణీకి కొత్తేమీ కాదు కానీ.. తాజా ఫోజ్ యూత్ ని రెచ్చ‌గొడుతోంది.

చండీఘ‌ర్ యూత్ ఆహా క‌ళ్యాణ‌మే! అంటూ వాణీ వెంట‌ప‌డినా ఆశ్చ‌ర్య‌పోక్క‌ర్లేదు. ది గ్రేట్ వాణీ క‌పూర్ య‌ష్ రాజ్ ఫిలింస్ ఆస్థాన నాయిక అన్న సంగ‌తి తెలిసిందే. చోప్రాలు త‌మ సంస్థ‌లో ప‌ర్మినెంట్ నాయిక‌గా వాణీని ఫిక్స్ చేసుకున్నారు. వైఆర్ఎఫ్ సంస్థ నిర్మించిన‌ శుధ్ దేశీ రొమాన్స్.. ఆహా కల్యాణం.. వార్ స‌హా ఎన్నో సినిమాల్లో వాణీ న‌టించింది.

వాణీ కపూర్ బాలీవుడ్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవలే అమ్మ‌డు న‌టించిన `బెల్ బాట‌మ్` రిలీజ్ అయింది. కానీ సినిమా ఆశించ‌నంత‌గా  రాణించ‌లేదు. అలాగే అభిషేక్ కపూర్ దర్శ‌క‌త్వంలో  `చండీఘ‌ర్ క‌రే ఆషిఖ్` ఇటీవ‌ల విడుద‌ల కాగా ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టించాడు. సినిమాకి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. జిమ్ లో అందాలు విర‌జిమ్మే జుంబా గాళ్ గా వాణీ అద‌ర‌గొట్టింద‌న్న టాక్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ మ‌ల్హోత్రా తెర‌కెక్కిస్తోన్న `షామ్ శ్రీ` అనే భారీ బ‌డ్జెట్  పిరియాడిక్ చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇందులో ర‌ణ‌బీర్ క‌పూర్..సంజయ్ ద‌త్ హీరోల‌గా న‌టిస్తున్నారు.
Tags:    

Similar News