ఫోటో టాక్‌ : ఫిల్మ్‌ ఫేర్ కోసం వాణి కపూర్ సూపర్‌ హాట్‌

Update: 2022-03-21 03:30 GMT
తెలుగు ప్రేక్షకులకు 2014 సంవత్సరంలో నాని తో కలిసి ఆహా కళ్యాణం అనే సినిమా తో పరిచయం అయ్యింది. ఆ సినిమా ప్లాప్‌ అవ్వడం తో తెలుగు లో ఈమె మళ్లీ కనిపించలేదు. కాని తెలుగు ప్రేక్షకులకు సోషల్‌ మీడియా ఇతర డబ్బింగ్‌ సినిమాలతో చేరువగానే ఉంది. దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని కలిగి ఉన్న వాణి కపూర్ సోషల్‌ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్‌ లో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తన అయిదున్నర మిలియన్‌ ల ఫాలోవర్స్ కోసం ఎప్పటికప్పుడు తన అందమైన రూపంతో ఫోటో షూట్‌ ను షేర్‌ చేస్తూ వస్తుంది. అందంతో పాటు మంచి అభినయం ఆమె సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన ఆమె ఫిజిక్ కు లక్షల కొద్ది ఫాలోవర్స్ మరియు అభిమానులు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ అమ్మడు తాజాగా మరో సారి తన అందమైన రూపంతో ఆకట్టుకుంది.

ప్రముఖ ఫిల్మ్‌ మ్యాగజైన్ అయిన ఫిల్మ్‌ ఫేర్ కోసం ఈమె ఫోటో షూట్‌ ఇచ్చింది. ఈ ఫోటో షూట్‌ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం ఆ ఫోటో షూట్‌ మరియు ఆమె కవర్ పేజీ ఫోటో నెట్టింట తెగ సందడి చేస్తోంది. గతంలో ఎన్నో సార్లు కవర్‌ పేజ్‌ కోసం స్టిల్‌ ఇచ్చినా కూడా సారి అంతకు మించి అన్నట్లుగా అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఫిల్మ్‌ ఫేర్ మ్యాగజైన్‌ కోసం గతంలో ఎంత మంది ముద్దుగుమ్మలు అందమైన హాట్ ఫోటో షూట్స్ చేశారు. కాని వాణి కపూర్‌ ఫోటో షూట్‌ వావ్‌ అనిపించేలా ఉందని.. కవర్ కు కొత్త కల వచ్చినట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి ఈ అమ్మడి అభిమానులు మాత్రమే కాకుండా ఇతరులు కూడా ఈమె స్టిల్‌ కు ఫిదా అవుతూ ఒక లైక్ ను ఇచ్చుకుంటున్నారు.

ఇక వాణి కపూర్‌ ప్రస్తుత ప్రాజెక్ట్‌ ల విషయానికి వస్తే.. షమ్ షేర అనే సినిమా లో నటిస్తుంది. ఈ ఏడాదిలో ఆ సినిమా విడుదల కాబోతుంది. ఇంకా కొన్ని టీవీ షో ల్లో మరియు వెబ్‌ సిరీస్‌ లను కూడా ఈమె చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వాణి కపూర్‌ ఆమద్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా కూడా మళ్లీ సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News