ఆ హామీ కావాలమ్మా మహేష్‌

Update: 2018-04-06 05:43 GMT

ఏంటో.. మహేష్ బాబుకి సామి అనే వర్డ్ కి అంతగా అచ్చొచ్చినట్లుగా కనిపించడం లేదు. కొన్నేళ్ల క్రితం ఖలేజా అంటూ ఓ మూవీ చేశాడు మహేష్ బాబు. అందులో సూపర్ స్టార్ ను నడిచే దేవుడు చేసేశాడు త్రివిక్రమ్. పక్కనే ఉండే సిద్ధప్ప పాత్రను పోషించిన షఫీ.. సామీ అంటూ పిలుస్తూ ఉంటాడు.

ఆ సినిమా ఏ రేంజ్ లో అభిమానులను డిజప్పాయింట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు మళ్లీ సామి అవతారం ఎత్తాడు. ఇప్పుడు వరాలిచ్చే సామి కాదు కానీ.. హామీలిచ్చే సామిగా మారిపోయాడు మహేష్ బాబు. వచ్చాడయ్యో సామీ అంటూ భరత్ అనే నేను మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాట ఆన్ లైన్ లో ట్రెండింగ్ అవుతోంది.. వ్యూస్ బాగానే వస్తున్నాయ్ కానీ.. పాట పరంగా మహేష్ ఫ్యాన్స్ కు కిక్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది. కొత్త రెక్కలు మొలకెత్తే హామీ ఇచ్చాడంటూ లిరికల్ గా బాగానే చెప్పుకొచ్చారు. కానీ సీఎం పాత్ర పోషిస్తున్న మహేష్ నుంచి ఆ హామీ కంటే.. హిట్టు కొడతానని తమ హీరో నుంచి వచ్చే హామీ కోసమే ఎదురుచూస్తున్నారు అభిమానులు.

అలాంటి సమయంలో మాటికోసారి ఈ సామీ అంటూ పదాన్ని ఉపయోగించడంతో.. ఒక్కసారిగా వాళ్లకు గుండె ఝల్లుమంది. శాటిలైట్ హిట్టు సినిమాగా మిగిలిపోయిన చిత్రాన్ని గుర్తు చేయడం ఎందుకు బాబూ అనుకుంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News