పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొంత గ్యాప్ తర్వాత నటిస్తున్న వకీల్ సాబ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పింక్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కి రానుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ ప్రమోషన్స్ లో ఇంతవరకూ కథానాయికల్ని హైలైట్ చేయకపోవడంపై అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి.
నాజానికి పింక్ నాయికల సినిమా. ఇందులో మహిళా పాత్రధారులదే హవా. కిలాడీ వకీల్ గా కనిపించారు అక్కడ. ఇక్కడ పవన్ కూడా వకీల్ గా కనిపిస్తున్నారు .. కానీ అతడి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని పాత్ర నిడివిని పెంచి కథానాయికను యాడ్ చేసి కమర్షియలైజ్ చేయడంపై రకరకాల సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటివరకూ పవన్ పోస్టర్ తోనే హడావుడి చేసేస్తుంటే రకరకాల డౌట్లు పుట్టుకొచ్చేస్తున్నాయ్.
అసలు ఒరిజినల్ ఫ్లేవర్ ని మిస్ చేస్తే ఫీల్ మిస్సవువుతుందేమోనన్న సందేహాన్ని అభిమానులే వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఇందులో నటిస్తున్న నివేధ థామస్.. అంజలి పోస్టర్లను ఇంతవరకూ రిలీజ్ చేయకుండా దాచడం వెనక లాజిక్ ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక దిల్ రాజు బిజినెస్ టెక్నిక్ లో భాగంగానే ఇలా పవన్ పేరును సద్వినియోగం చేస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వీటన్నిటికీ సమాధానం ఇకపై ప్రమోషన్స్ లో అయినా ఉంటుందేమో చూడాలి. ఆచార్య.. నారప్ప.. బీబీ3.. ఖిలాడీ.. ఇవన్నీ రిలీజ్ కాక ముందే వకీల్ సాబ్ రిలీజ్ కానుంది. ఏప్రిల్ 9 తేదీని లాక్ చేసిన సంగతి తెలిసిందే.