రచయితగా ‘కిక్’- ‘ఎవడు’- ‘ఊసరవెల్లి’- ‘టెంపర్’ వంటి సినిమాలకు స్క్రిప్టు అందించిన వక్కంతం వంశీ... ఎప్పటినుంచో దర్శకుడు కావాలని కలగన్నాడు. బన్నీతో చేసిన ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ సినిమాతో ఆయన కల నిజమయ్యింది. అయితే టీజర్- ట్రైలర్ ఇంప్రెస్ చేసినట్టుగా సినిమా ఆకట్టుకోలేకపోయింది. దీంతో నెక్స్ట్ వక్కంతం వంశీ దారెటు అనేది ఆసక్తికరంగా మారింది.
నిజానికి వక్కంతం వంశీ తన తొలిసినిమాను యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్ తో చేయాలి. రచయితగా ఉన్నప్పుడే వంశీ స్క్రిప్టు రైటింగ్ స్టైల్ నచ్చి... నీతో సినిమా చేస్తానని మాటిచ్చి కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చాడట తారక్. ఈ విషయాన్ని వక్కంతం చాలాసార్లు మీడియాలో వెల్లడించాడు. అయితే ఏమైందో ఏమో కొన్నాళ్లపాటు తారక్ కోసం వెయిట్ చేసిన వంశీ... ఉన్నట్టుండి బన్నీతో సినిమా మొదలెట్టాడు. ‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ సినిమా పూర్తి చేసి- థియేటర్లలోకి రప్పించాడు. అయితే హీరో పాత్ర మీద తప్ప... కథనూ- మిగిలిన పాత్రలనూ ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో తేడా కొట్టేసింది. అయితే అప్పట్లో వక్కంతం వంశీ చెప్పిన కథను విని- తారక్ కొన్ని మార్పులు సూచించాడని కల్యాణ్ రామ్ చెప్పాడు. అవేవో చేసి ఉంటే ఇప్పటికి సినిమా అయిపోయి ఉండేది. పంతానికి పోయి బయటికి వచ్చేశాడు.
‘నా పేరు సూర్య’ సినిమా సూపర్ హిట్ అయ్యి ఉంటే వక్కంతం వంశీ పరిస్థితి వేరుగా ఉండేది. రామ్ చరణ్ నుంచి ఎన్.టీ.ఆర్ దాకా హీరోలందరూ ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించేవారు. ఇండస్ట్రీకి మరో కొరటాల శివ లాంటి దర్శకుడు దొరికాడని తెగ పొగిడేసేవాళ్లు. ఇప్పుడు ‘నా పేరు సూర్య’ రిజల్ట్ చూశాక... ఏ స్టార్ హీరో అతనితో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మరి తారక్ కోసం రాసిన కథ అలాగే ఉందని చెప్పిన వక్కంతం వంశీ మళ్లీ ఆయన దగ్గరికే సూచించిన మార్పులతో వెళ్తాడా? లేక గీతా ఆర్ట్స్ లోనే రెండో సినిమా కమిట్ అయ్యాడనే వార్తలను బట్టి మళ్లీ మెగా హీరోల కోసమే కథ రాసి నిరీక్షిస్తాడా.. వేచి చూడాలి!