ఎలాగైనా దర్శకుడు కావాలనే కసితో ‘నా పేరు సూర్య’ సినిమా చేశాడు రచయిత వక్కంతం వంశీ. రచయితగా మంచి పవర్ ఫుల్ కిక్ ఇచ్చే కథలను అందించిన వంశీ... దర్శకుడిగా మారే సరికి కథలో లాజిక్కులను మిస్ అయ్యాడు. చాలా సినిమాల్లో లాజిక్కులు లేని సన్నివేశాలు ఉంటాయి కానీ వాటిని డైరెక్టర్స్ తమ మ్యాజిక్ తో వాటిని కప్పేస్తుంటారు. కానీ ఇక్కడ వంశీ ఆ పని చేయలేకపోయాడు.
‘నా పేరు సూర్య’ సినిమా చూసిన వారందరికీ కథలో లాజిక్ మిస్సయిన సంగతి ఈజీగా అర్థమైపోతుంది. కోపిస్టి సూర్య పిల్లాడిగా ఉన్నప్పుడే కోపంతో ఇల్లు వదిలి పారిపోతాడు. ఎలాగోలా మిలటరీలో చేరి తన అతి కోపం వల్ల ఉద్యోగం కోల్పోతాడు. మళ్లీ ఉద్యోగం కోసం తండ్రి దగ్గరికి సంతకం కావాలంటూ వస్తాడు సూర్య. పెరిగి పెద్దయిన కొడుకు సూర్య కళ్లముందుకే వచ్చినా అతని తల్లి గుర్తు పట్టదు. ఇది చాలా సినిమాల్లో చూసిందే. ప్రభాస్ ‘ఛత్రపతి’- ‘ఏక్ నిరంజన్’ సినిమాలు కూడా ఇదే బాపతు. కానీ సూర్యకి చిన్నతనం నుంచే కంటి మీద గాటు ఉంటుంది. అది చూసినప్పుడైనా తల్లికి కొడుకు గుర్తు రావాలి కదా! ఇదే లాజిక్ మిస్సయ్యాడు వక్కంతం వంశీ.
సినిమా చూసిన ఓ వ్యక్తి ఫోన్ చేసి నిలదీసే సరికి... ‘సారీ... క్షమించండి. లాజిక్ మిస్సయ్యా...’ అంటూ తప్పు ఒప్పేసుకున్నాడు వంశీ. నిజానికి వంశీ కథలో సూర్యకి గాటు ఉండదట. అయితే కథను బాగా ఓన్ చేసుకున్న బన్నీ... హీరో కోపానికి గుర్తుగా ముఖంపై ఓ గాటు ఉంటే బాగుంటుందని పెట్టుకున్నాడట. ఆ విషయం తెలిసిన తర్వాతైనా లాజిక్ గురించి ఆలోచించలేదు వంశీ. అందుకే ఇప్పుడు బుక్కయ్యాడు.