'ఆర్ఆర్ఆర్‌' ను గ‌ట్టి దెబ్బ కొట్ట‌బోతున్న అజిత్ 'వ‌లిమై'?

Update: 2022-02-26 15:30 GMT
తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం `వలిమై`. హెచ్. వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై బోనీ కపూర్ నిర్మించారు. ఈ హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో కార్తికేయ గుమ్మకొండ విల‌న్‌గా న‌టించాడు. భారీ అంచ‌నాల న‌డుమ‌ ఫిబ్ర‌వ‌రి 24న త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల అయింది.

యాక్ష‌న్ ప్రియుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్న ఈ చిత్రం.. క‌లెక్ష‌న్ల ప‌రంగా సునామి సృష్టిస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ చిత్రం తొలిరోజే రూ.34 కోట్లను వసూలు చేసి దుమ్ము దులిపేసింది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత‌ వచ్చినప్పటికీ అజిత్‌ వలిమైతో మరోసారి తన మార్క్‌ చూపించాడు. అయితే థియేటర్‌లో రిలీజైన సినిమాలు.. కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు కామ‌న్ అయిపోయిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలోనే వ‌లిమై సినిమాకు సైతం ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది.  వ‌లిమై డిజిట‌ల్ రైట్స్‌ను ఏకంగా రూ.70 కోట్ల‌కు కొనుగోలు చేసిన జీ స్టూడియోస్.. మార్చి 25న సినిమాను స్ట్రీమింగ్ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే.. `ఆర్ఆర్ఆర్‌`ను వ‌లిమై గ‌ట్టి దెబ్బ కొట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన `ఆర్ఆర్ఆర్‌` చిత్రం అనేక వాయిదాల అనంత‌రం మార్చి 25వ తేదీనే తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. అయితే ఇప్పుడు అదే తేదీన వ‌లిమై ఓటీటీలోకి వ‌స్తే.. తమిళనాట `ఆర్ఆర్ఆర్‌`థియేటర్‌ కలెక్షన్లపై ఖ‌చ్చితంగా ప్ర‌భావం ప‌డుతుంద‌ని సినీ ప్రియులు భావిస్తున్నారు.
Tags:    

Similar News