తళా అజిత్ నటించిన సినిమాలు తమిళంలో 100కోట్లు పైగా కలెక్షన్స్ తో సునామీ సృష్టించడం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం. అయితే అతడికి తెలుగులో అంతగా మార్కెట్ లేదా? తన రేంజ్ ఇక్కడ 5 కోట్లు మించడం లేదా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అజిత్ నటించిన క్రేజీ మూవీ `వలీమై` తెలుగు రైట్స్ కి 5కోట్లు వెచ్చించారని తెలిసింది. ఇది అజిత్ కి పెద్ద రేటు .. ఆ మొత్తాన్ని తిరిగి వెనక్కి తేవడం అంత సులువేమీ కాదని ట్రేడ్ విశ్లేషించడం ఆశ్చర్యపరుస్తోంది.
అయితే దీనికి కారణం ప్రస్తుతం ఉన్న ఓమిక్రాన్ పరిణామంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల సమస్య కూడా ఒక కారణం. నిజానికి అజిత్ ఇతర తమిళ హీరోలతో పోటీపడుతూ వరుస హిట్లు అందుకుంటున్నా అది తమిళం వరకే పరిమితం. తెలుగు బాక్సాఫీస్ వద్ద ఇటీవల అంతగా రాణించడం లేదు. అయితే వలీమై తో దానిని తిరగరాస్తాడనే భావిస్తున్నారు. దురదృష్ట వశాత్తూ ఈ సంక్రాంతి రేసునుంచి అజిత్ వలీమై తప్పుకుంది. తిరిగి ఎప్పుడు రిలీజవుతుందో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.