కలిస్తే చాలు అనుకున్నా.. ఒక్కసారికే ఓకే చెప్పాడు

Update: 2021-10-02 03:30 GMT
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ తెలుగు సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది. ఈ ఏడాది ఆరంభం నుండి ఈ సినిమా గురించి ప్రచారం జరుగుతోంది. విజయ్ తెలుగు లో ఒక సినిమాను చేయబోతున్నాడు.. ఆ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడు.. దిల్‌ రాజు ఆ సినిమాను నిర్మించబోతున్నాడు అంటూ వచ్చిన వార్తలు చాలా మంది ముందుగా నమ్మలేదు. కాని కంటిన్యూస్ గా నెలల తరబడి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇక నిజమే అన్నట్లుగా చాలా మంది ఒక అభిప్రాయంకు వచ్చేశారు. మళ్లీ కొన్ని రోజుల పాటు సైలెంట్‌ అవ్వడంతే అంతా ఉత్తిదేనా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ సమయంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్‌ హీరో విజయ్ మూవీ అంటూ అధికారికంగా దిల్‌ రాజు ఆఫీస్ నుండి ప్రకటన వచ్చింది. ముగ్గురు కలిసి ఉన్న ఫొటో కూడా బయటకు రావడంతో ఇక అనుమానం లేదని తేలిపోయింది. అధికారంగా ప్రకటన వచ్చిన తర్వాత సినిమా గురించి దర్శకుడు వంశీ చాలా ఎగ్జైట్ అవుతు మాట్లాడుతూ ఉన్నాడు. ఈమద్య ఆయన వరుసగా ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నాడు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. విజయ్ సర్ ను ఒక్కసారి కలవడం చాలా అనుకున్నాను. ఆయనతో సినిమా చేసే అవకాశం కోసం ఎదురు చూశాను. ఆయనకు కథ చెప్పే అవకాశం వచ్చిన సమయంలో ఎలా చెప్తానో అనే అనుమానం నాపై నాకే కలిగింది. అయితే ఆయన్ను కలిసే అవకాశం వచ్చిందని చాలా సంతోషం అనిపించింది. కథ కు ఓకే అయినా కాకున్నా కూడా పర్వాలేదు అనుకున్నాను. రెండు గంటల పాటు కథను వినిపించాను. ఆయన కథను ఎలా వింటాడు.. నేను ఎలా వినిపించాలి అనే విషయంలో మొదటి నుండి కాస్త కంగారు పడ్డాను. ఆయన చాలా కూల్ గా కథను విన్నాడు. ఆ రెండు గంటల నరేషన్ కే కథకు ఓకే చెప్పేశాడు. ఆ సిట్టింగ్ లోనే సినిమా కు ఓకే చెప్పడం నాకే ఆశ్చర్యంగా అనిపించింది.

ఆ రెండు గంటలు ఏం జరిగింది అనేది నాకు ఇంకా అర్థం కాలేదు. ఆ సమయంలో అదృష్టం అలా కలిసి వచ్చిందని.. ఆ అదృష్టం వల్లే నాకు అవకాశం వచ్చింది అంటూ వంశీ తన సంతోషాన్ని చెప్పుకొచ్చాడు. ఆయన ఈ సినిమా కోసం ఎంత ఎగ్జైట్‌ గా ఉన్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎంతో అభిమానించే హీరోతో సినిమా తీసే అవకాశం వస్తే ఒక అభిమానిగా ఏ రేంజ్ లో తమ హీరోను చూడాలనుకుంటారో అలా చూపిస్తారు. వంశీ కూడా తన అభిమాన హీరో అయిన విజయన్‌ ను ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా చూపిస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. నెట్టింట ఈ సినిమా గురించిన చర్చలు తారా స్థాయిలో జరుగుతున్నాయి. తెలుగు మరియు తమిళంలోనే కాకుండా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.




Tags:    

Similar News