హిట్టు సంగతి పక్కన పెడదాం. కనీసం వరుణ్ సందేశ్ నటించిన సినిమాలు థియేటర్లకు వచ్చిన సంగతి కూడా జనాలకు తెలియట్లేదు చాలా కాలంగా. నిర్మాతలు వరుణ్‌ను నమ్మి పెట్టుబడి పెడుతున్నారో కానీ.. అతను మాత్రం ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు ఇచ్చి వెళ్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తన సినిమా ఆడాలని వరుణ్‌కు కూడా ఏమాత్రం కోరిక లేదేమో అనిపిస్తోంది అతను ఎంచుకున్న సబ్జెక్టులు.. వాటి ప్రమోషన్.. వాటి విడుదల వ్యవహారాలు చూస్తుంటే. రిలీజ్ ప్లానింగ్ విషయంలో ఎంత పూర్‌గా ఉంటున్నాడో అతడి గత రెండు సినిమాలే ఉదాహరణ.
డిసెంబర్లో 'లింగ' సినిమా హంగామా నెలకొన్న సమయంలో దాంతో పాటుగా వరుణ్ సినిమా 'ఈ వర్షం సాక్షిగా' రిలీజైంది. దాని గురించి మాట్లాడుకున్న వాళ్లే లేరు. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఎన్టీఆర్ మూవీ 'టెంపర్' రిలీజైన మరుసటి రోజు 'పడ్డానండి ప్రేమలో మరి' రిలీజ్ చేశాడు. దాని సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడిక ఈ శుక్రవారం ఆల్రెడీ జ్యోతిలక్ష్మీ, కేరింత పోటీలో ఉన్నాయి. ఈ రెండు సినిమాల్నీ బాగా ప్రమోట్ చేస్తూ మంచి క్రేజ్ తీసుకొచ్చారు. ఇలాంటి సమయంలో వరుణ్ తన కొత్త సినిమా 'లవకుశ' రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటిదాకా ఈ సినిమాకు ప్రమోషన్ అన్నదే లేదు. విడుదల సంగతే జనాలకు తెలియట్లేదు. వరుణ్ మీద ఉన్న 'నమ్మకం' వల్ల ఒకవేళ సినిమా బాగున్నా.. జనాలకు తెలిసే లోపే థియేటర్ల నుంచి లేచిపోయే పరిస్థితి.