మహేశ్‌ కు హిమజ షాక్..పేడ నీళ్ళలో పడుకున్న వరుణ్...

Update: 2019-09-17 05:46 GMT
బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు వెరైటీగా ఉంటాయని మరోసారి రుజువైంది. ఇప్పటివరకు లేని విధంగా సోమవారం ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ చేపట్టి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చారు. ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా గార్డర్ ఏరియాలో టెలిఫోన్ బూత్ పెట్టి.... అందులో ఉన్న మొదట ఫోన్ లిఫ్ట్ చేసిన శ్రీముఖికి బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. మొదట లిఫ్ట్ చేసినందుకు ఎలిమినేషన్ కు నేరుగా నామినేట్ అయ్యారని చెప్పి....దాని నుంచి సేఫ్ అవ్వాలంటే బాబా భాస్కర్ క్లీన్ షేవ్ చేసుకోవాలని చెబుతాడు. దీంతో శ్రీముఖి బాబాకు విషయం చెప్పి క్లీన్ షేవ్ చేయమంటుంది. దానికి బాబా ఒప్పుకుని క్లీన్ షేవ్ చేసుకోవడంతో శ్రీముఖి సేఫ్ అయింది.

ఆ తర్వాత పునర్నవికి కాల్ రాగా - ఆమె ఎలిమినేషన్ నుంచి సేఫ్ అవ్వాలంటే రాహుల్ 20 గ్లాసుల కాకరకాయల జ్యూస్ తాగాలని చెప్పాడు. దీనికి రాహుల్ ఒప్పుకుని పున్నూ కోసం జ్యూస్ తాగేశాడు. దీంతో పున్నూ సేఫ్ అయిపోయింది. ఆ తర్వాత వరుణ్‌ కు ఫోన్ రాగా - తను సేఫ్ అవ్వాలంటే శ్రీముఖి బిగ్ బాస్ ఐ  టాటూగా వేసుకోవాలని చెబుతాడు. దీంతో శ్రీముఖి వరుణ్ కోసం టాటూ వేసుకుని సేఫ్ చేసింది. ఇక మహేశ్ నామినేషన్ నుంచి సేఫ్ కావాలంటే హిమజ తన మొత్తం బట్టలు - మేకప్ కిట్ స్టోర్ రూమ్ లో పెట్టేయాలని కండిషన్ పెట్టారు. అయితే హిమజ అలాగే పెట్టింది కానీ...కొన్ని వస్తువులు ఉంచేసింది. దీంతో పూర్తిగా బట్టలు - మేకప్ కిట్ పెట్టనందున మహేశ్ డైరెక్ట్ గా నామినేట్ అయ్యారు.

అలాగే బాబా భాస్కర్ సేఫ్ అవ్వడానికి రవి తనకు ఇష్టమైన షూ లని పెయింట్ లో పెట్టేశాడు. దీంతో బాబా సేఫ్ అయ్యాడు. అటు శివజ్యోతి కోసం మహేశ్ జుట్టుకు ఎరుపు రంగు వేసుకుని ఆమెని సేఫ్ చేశాడు. అయితే హిమజ కోసం వరుణ్ పేడ నీళ్ళలో పడుకుని అతి పెద్ద త్యాగం చేశాడు. దుర్వాసన వచ్చిన వాంతులు చేసుకుంటూనే అందులో ఉన్నాడు. చివరికి హిమజ సేఫ్ అయ్యేవరకు అందులోనే ఉన్నాడు. ఇక మిగతా ఎలిమినేషన్ కార్యక్రమం మంగళవారం ఎపిసోడ్ లో కూడా కొనసాగనుంది.



Tags:    

Similar News