స్పేస్ లో జరిగే కథతో హాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. తెలుగులో ఇంతవరకు అలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఇండియాలో అండర్ వాటర్ కాన్సెప్ట్ తో ఘాజీ సినిమా తీసి నేషనల్ అవార్డ్ గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ఈ ప్రయోగానికి రెడీ అయ్యాడు. తన తరవాత సినిమాకు అంతరిక్షాన్ని కాన్సెప్ట్ గా ఎంచుకున్నాడు. మెగా హీరో వరుణ్ తేజ్ ఈ సినిమాలో ఆస్ట్రోనాట్ గా కనిపించనున్నాడు.
టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్... రాజీవ్ రెడ్డి ల సంయుక్త నిర్మాణంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈ స్పేస్ కాన్సెప్ట్ సినిమా వస్తోంది. తాజాగా తీసిన ముహూర్తం షాట్ ను క్రిష్ డైరెక్ట్ చేశాడు. హీరో వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు.. సంకల్స్ రెడ్డి తండ్రి సహదేవ్ వీర్ రెడ్డి కూడా ఈ ప్రోగ్రాంకు అటెండయ్యారు. ఈ మూవీలో హీరోయిన్లుగా లావణ్య త్రిపాఠితోపాటు బాలీవుడ్ హీరోయిన్ చెలియా ఫేం అదితిరావ్ హైదరి నటిస్తున్నారు. ముహూర్తం షాట్ కు లావణ్య సంప్రదాయబద్ధంగా చీర కట్టుకొస్త్తే.. అదితిరావ్ మోడ్రన్ డ్రస్ లో మెరుపులు మెరిపించింది.
ఫిదా.. తొలిప్రేమతో రెండు వరస హిట్లు అందుకున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో మూడో హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నాడు. డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ముందు తీసిన ఘాజీ మూవీ కోసం పెద్ద సబ్ మెరైన్ సెట్ వేశారు. ఆ సినిమాలో ఆ సెట్ చాలా కీలకంగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా కోసం కూడా భారీ స్పేస్ షటిల్ సెట్ వేయనున్నారు. ఇందులోనూ ఆ సెట్ చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది.