టాలీవుడ్ హీరోలు.. బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ కుదుర్చుకోవడంలో మహా బిజీ అయిపోతున్నారు. అసలు బడా కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని.. కోట్లు కూడబెట్టడం విషయంలో.. మహేష్ బాబు ను టాలీవుడ్ హీరోలకు గురువుగా చెప్పవచ్చు. ఆ తర్వాత ఈ రూట్ ను చాలామందే ఫాలో అయ్యేందుకు ట్రై చేశారు. మహేష్ తర్వాత ఎక్కువగా అల్లు అర్జున్ దగ్గర బడా బ్రాండ్స్ ఉంటాయి. రీసెంట్ గా హప్పి అనే మొబైల్ స్టోర్ కు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు చెర్రీ. ప్రభాస్ అయితే.. బాహుబలి తర్వాత బాగానే బిజీ అయ్యాడు.
కుర్ర తారలు కూడా ఇప్పుడు తమ వంతు సత్తా చాటేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటికే బిగ్ సీ బ్రాండ్ కు ప్రచారం చేయడంలో మహా బిజీగా ఉంది. తొలి సినిమా రిలీజ్ కు ముందు నుంచే అఖిల్ ను బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్. టైటాన్ వంటి బడా కంపెనీలకు అఖిల్ ప్రచారం చేశాడు. చెన్నై షాపింగ్ మాల్ కు ప్రచారం చేస్తున్నాడు చైతు. రీసెంట్ గా బిగ్ బజార్ కు తన భార్య సామ్ తో కలిసి అడ్వర్టైజ్ చేస్తున్నాడు కూడా.
ఇప్పుడీ జాబితాలో యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ కూడా చేరిపోయాడు. ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థతో బ్రాండ్ ఎండార్స్ మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాడు ఈ ఫిదా హీరో. ఇప్పటికే సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ మొదలైపోయాయి కూడా. త్వరలో టీవీల్లో కూడా వరుణ్ తేజ్ ప్రకటనలు వచ్చేయడం ఖాయం. ఒకవైపు సినిమాలు.. మరోవైపు ప్రకటనలు.. ఏమైనా మన హీరోల స్పీడు భలేగుంది బాసూ.