నాన్న కామెంట్స్ గురించి వరుణ్ తేజ్

Update: 2018-12-20 10:57 GMT
ఇటీవలి కాలంలో ట్రెండింగ్ లో నిలిచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపిన టాపిక్ ఏదైనా ఉంది అంటే అది మెగా బ్రదర్ నాగబాబు బాలయ్య ఎవరో తనకు తెలియదు  అని చెప్పడమే. అదే ఒక వైరల్ అనుకుంటే మరుసటి రోజు కమెడియన్ బాలయ్య తనకు తెలుసంటూ మరో బాంబు పేల్చి నందమూరి ఫ్యాన్స్ కి మరింత కోపం వచ్చేలా నాగబాబు చేసిన కామెంట్స్ ఇష్యూని కాస్త ముదిరేలా చేశాయి. తర్వాత ఎవరి పనులల్లో వారు పడిపోవడంతో తాత్కాలికంగా ఆ చర్చకు బ్రేక్ పడిపోయింది. ఇదిలా ఉండగా అంతరిక్షం ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్న వరుణ్ తేజ్ కు ఒక మీడియా సైట్ ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురైందట.

తనదైన శైలిలో దీనికి ధీటుగా బదులిచ్చిన వరుణ్ తేజ్ తర్వాత ఆ బైట్ మాత్రం డిలేట్ చేయమని చెప్పాడట. సినిమా విడుదల పెట్టుకుని ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రభావం చెందే అవకాశం ఉండటంతో వద్దని చెప్పిన కారణంగా సదరు ఛానల్ అది ఎడిట్ చేసి ఇంటర్వ్యూ విడుదల చేసిందట. అయితే వరుణ్ తేజ్ బాలయ్య గురించి నాన్న చేసిన కామెంట్స్ పట్ల ఏం చెప్పాడు అనేది మాత్రం సస్పెన్స్ గానే మిగిలిపోయింది.

అయినా సాధారణంగా సెలెబ్రిటీలను ఇంటర్వ్యూలకు పిలిచినప్పుడు ఏవైనా కాంట్రావర్సీ క్వశ్చన్స్ ఉంటే ముందే చెప్పి అనుమతి తీసుకుంటారు. అయితే బాలయ్య టాపిక్ మాత్రం ముందే హింట్ ఇవ్వకుండా నేరుగా అడిగేసినట్టు తెలిసింది. ఇది ఇప్పుడు కాకపోయినా అంతరిక్షం సందడి చల్లారాక బయటికి వచ్చే అవకాశం లేకపోలేదు. నాగబాబుని సమర్ధించాడో లేక బాలయ్య నాన్నకు తెలియకపోతేనేం పెదనాన్న ఫ్రెండ్ గా నాకు తెలుసుగా అంటూ కవరింగ్ ఇచ్చాడో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు
Tags:    

Similar News