వరుణ్ రేట్ పెంచాడమ్మా

Update: 2018-02-15 18:19 GMT
మెగా బ్రదర్స్ లో చిరంజీవి పవన్ కళ్యాణ్ మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. కానీ నాగబాబు మాత్రం వారి అంత కాకపోయినా మినిమమ్ రేంజ్ లో కూడా ఇమేజ్ ను అందుకోలేదు .కానీ ఓ విధంగా సైడ్ క్యారెక్టర్స్ అండ్ టీవీ షోలతో పరవాలేదు అనిపిస్తున్నారు. అయితే ఆయన తనయుడు వరుణ్ తేజ్ మాత్రం తండ్రి యొక్క కళను చక్కగా నెరవేరుస్తున్నాడు. మొన్నటి వరకు ఆర్థికంగా నాగబాబు ఫ్యామిలీ పవర్ స్టార్ మెగా స్టార్ కంటే తక్కువగానే ఉండేది.

కానీ వరుణ్ తేజ్ వరుస హిట్స్ అందుకోవడంతో ఆ ఫ్యామిలీకి కష్టాలు తప్పాయి అన్నట్లు పరిస్థితి చక్కబడింది. వరుణ్ తేజ్ ఫిదా - తొలిప్రేమ సినిమాలతో మంచి ఎమౌంట్ అందుకున్నాడు. ఒక్కో సినిమాకు రూ2.5 కోట్ల రెమ్యునరేషేన్ అందడంతో ఇటీవల తండ్రికి ఒక కారును కూడా కొనిచ్చాడు. అయితే వరుణ్ కి వరుసగా రెండు హిట్స్ అందడంతో మార్కెట్ కూడా పెరిగింది. మార్కెట్ పెరిగినప్పుడు రెమ్యునరేషన్ ని కూడా పెంచాలి కాబట్టి వరుణ్ రేట్ పెంచేశాడట.

ఇక తన నెక్స్ట్ సినిమాలకు వరుణ్ 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకూండా యాక్షన్ తరహా సినిమాలకు ఆ ఛార్జిలు ఇంకా పెరిగే అవకాశం ఉండవచ్చని మెగా సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మెగా హీరో కజకిస్తాన్ వెళ్లడానికి సిద్దమయ్యాడు. సంకల్ప్ తో చేసే నెక్స్ట్ సినిమా కోసం అక్కడ వెయిట్ లాస్ కి సంబందించిన వర్కౌట్ చేయనున్నాడు. నెల రోజులు వరకు వరుణ్ అక్కడే గడపనున్నాడట.


Tags:    

Similar News