మేకోవర్ తో చంపేసిన మెగా అబ్బాయి!

Update: 2019-04-02 15:07 GMT
మెగా హీరోలలో ప్రిన్స్ అని పిలిపించుకునే వరుణ్ తేజ్ స్టొరీ సెలెక్షన్ మొదటి నుంచి విభిన్నంగానే ఉంది.  అదే ట్రెండ్ ఫాలో అవుతూ 'జిగార్తాండ' రీమేక్ వాల్మీకి లో నెగెటివ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా కిరణ్ కొర్రపాటి అనే డెబ్యూ దర్శకుడితో ఒక స్పోర్ట్స్ డ్రామాకు కూడా సై అన్నాడు.  ఈ సినిమాకోసం ఇప్పుడు భారీగా ప్రిపరేషన్ జరుగుతోంది.

ఈ సినిమాలో వరుణ్ ఒక ప్రొఫెషనల్ బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు.  అందుకే గత కొన్ని రోజులుగా అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.  ఒలింపిక్  క్రీడలలో పాల్గొనడమే కాకుండా పతకాలు కూడా సాధించిన టోనీ జెఫ్రీస్ శిక్షణలో గత రెండు నెలలుగా కఠిన శిక్షణ తీసుకున్నాడు. తాజాగా వరుణ్ తేజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ఒక ఫోటో పోస్ట్ చేస్తూ "గత రెండు నెలలుగా ఈ వ్యక్తితో అద్భుతంగా గడిచింది.. టోనీ జెఫ్రీస్.. నిన్ను మిస్ అవుతాను.  మరోసారి త్వరలో ట్రైనింగ్ లో కలుద్దాం" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.  ఫోటోలో వరుణ్ తేజ్ తో పాటుగా టోనీ కూడా ఉన్నారు.

ఇక ఫోటోలో వరుణ్ తేజ్ మేకోవర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  'F2' రిలీజ్ అయిన సమయంలో కాస్త ఒళ్ళు చేసిన వరుణ్ ఇప్పుడు స్లిమ్ గా.. చాలా ఫిట్ గా ఉన్నాడు.  మీసాలు గెడ్డం ఫుల్ గా పెంచి డిఫరెంట్ లుక్ లో ఉన్నాడు.  టీ షర్టు.. షార్ట్.. కూలింగ్ గ్లాసెస్ తో హాలీవుడ్ హీరోలాగా కనిపిస్తున్నాడు.  తన కొత్త సినిమాకోసం వరుణ్ పూర్తిగా మారిపోయాడు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో నటుడు సునీల్ శెట్టి కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళకమునుపే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Tags:    

Similar News