వివాదంలో మెగా 'వాల్మీకి'

Update: 2019-01-29 17:02 GMT
వరుణ్‌ తేజ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఇటీవల ప్రారంభం అయిన చిత్రం 'వాల్మీకి'. నిహారిక క్లాప్‌ కొట్టగా ప్రారంభం అయిన ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే ఈ చిత్రం టైటిల్‌ వివాదాస్పదం అయ్యింది. వాల్మీకి టైటిల్‌ ను ఇలాంటి ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సినిమాకు వాడటం ఏంటంటూ వాల్మీకి సామాజిక వర్గం కు చెందిన సాయి ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. వాల్మీకి సామిజిక వర్గ నాయకులు 'వాల్మీకి' చిత్రం షూటింగ్‌ ను అడ్డుకుంటామని హెచ్చరించారు.

'వాల్మీకి' టైటిల్‌ లోగో లో గన్‌ ను ఉంది - వాల్మీని పేరును ఈ చిత్రంలో ఉపయోగించి మమ్ములను హింసను ప్రేరేపించే వారిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని - తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఈ చిత్రం ఉండబోతుందనే అనుమానం కలుగుతుందని - టైటిల్‌ మార్చడం తో పాటు - సినిమాలో వాల్మీకి అనే పేరు కూడా ఉండ కూడదని సాయి ప్రసాద్‌ హెచ్చరించాడు. సినిమాకు టైటిల్‌ మార్చకుంటే మాత్రం షూటింగ్‌ ఎక్కడ జరిగినా అడ్డుకుంటామని - కాదూ కూడదని షూటింగ్‌ పూర్తి చేసినా సినిమాను విడుదల కానివ్వమంటూ సాయి ప్రసాద్‌ హెచ్చరించాడు.

వాల్మీకి చరిత్ర తెలియన వారు ఆయన పేరుతో సినిమా తీయడం ఏంటని అన్నారు. కుటుంబ విలువలు గొప్పగా చాటి చెప్పే రామాయణంను రాసిన వాల్మీకి పేరుతో ఇలాంటి హింసాత్మక సినిమాలు తీయడంను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని సంఘం నాయకులు అంటున్నారు. వాల్మీకి సంఘంకు చెందిన ప్రజలంతా ఒకప్పుడు ఫ్యాక్షనిస్టులుగా ఉన్నా, ఇప్పుడు మాత్రం అంతా కూడా ఫ్యాక్షనిజం వదిలేశామని - వాల్మీకి సంఘంకు చెందిన ఏ ఒక్కరు కూడా ఇప్పుడు ఫ్యాక్షనిస్టులు కాదని - కాని వాల్మీకి సినిమాలో మాత్రం గన్‌ చూపిస్తూ మమ్ములను ఇంకా ఫ్యాక్షనిస్టులుగా చూపించే ప్రయత్నంను హరీష్‌ శంకర్‌ చేస్తున్నాడని - వెంటనే టైటిల్‌ మార్చకుంటే మాత్రం సీరియస్‌ చర్యలు ఉంటాయని దర్శకుడు హరీష్‌ శంకర్‌ ను సాయి ప్రసాద్‌ హెచ్చరించాడు. ఈ వివాదంపై దర్శకుడు ఎలా స్పందిస్తాడో చూడాలి.


Tags:    

Similar News