'ప్రపంచం నార్మల్ స్థితికి ఎప్పుడొస్తుందో' అంటున్న మెగాహీరో!!

Update: 2020-07-17 15:30 GMT
మెగా హీరో వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో తక్కువగా కనిపిస్తుంటాడు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు దారుణంగా ఉండటంతో ఎవరు కూడా బయటికి రాలేకపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య వేలలో నమోదవుతుంది. జనాలంతా భయాందోళనలతో ఏ పని చేసుకోలేక పోతున్నారు. సామాన్యుడి దగ్గర నుండి సెలబ్రిటీల వరకు ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ సమయంలో హీరో వరుణ్ తేజ్ తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా కొత్త పోస్ట్ పెట్టాడు. 'కరోనా నుండి త్వరలో ఈ ప్రపంచం సాధారణ స్థితికి రావాలని తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. అలాగే పోస్ట్ తో పాటు తను సోఫాలో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటో పోస్ట్ చేసాడు. ఆ ఫోటోలో వరుణ్ నల్ల ప్యాంటుతో పాటు మెరూన్ చొక్కా ధరించి ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్నాడు.

ప్రపంచం సాధారణ స్థితికి ఎప్పుడు వస్తుందో.. అని అర్థం తెలుపుతున్న వరుణ్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవలే జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న బ్లాక్ అండ్ వైట్ పిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇదిలా ఉండగా.. వరుణ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. అందుకోసం తన బాడీని, బాడీ లాంగ్వేజ్ మొత్తం సినిమాకి కావాల్సినట్లుగా మలుచుకున్నాడట. ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా కరోనా విజృంభనతో నిలిపేయాల్సి వచ్చింది. ఈ మధ్య కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు వరుణ్. ఇప్పుడిప్పుడే కెరీర్ ని ఒక దశలోకి మలుచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇక తను చేస్తున్న ప్రస్తుత సినిమా వరుణ్ కి 10వ సినిమా. ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకునిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాను అల్లు బాబీ, ముద్ద సిద్దులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ కథానాయికగా తెలుగుతెరకు పరిచయం కానుంది.
Tags:    

Similar News