మెగా ప్రిన్స్ గ్రీకువీరుడి రూపం

Update: 2019-10-04 12:40 GMT
అపుడెపుడో ట్రాయ్ రిలీజైంది గుర్తుందా? ఆస్కార్ సినిమాగా రికార్డుల‌కెక్కింది. 300 త‌ర్వాత అంత ప్ర‌భావ‌వంతంగా వార్ సినిమాని ఇంత‌వ‌ర‌కూ ఎవ‌రూ తెర‌కెక్కించ‌లేదు. అందులో వీరాధివీరుడైన క‌థానాయ‌కుడిని చూడ‌గానే అరే గ్రీకువీరుడంటే ఇలా ఉండాలి అంటూ యూత్ తెగ ముచ్చ‌ట‌పడిపోయారు. ఆ హీరో ఎవ‌రు అంటే.. బ్రాడ్ పిట్.. పెర్ఫెక్ట్ ఫిట్ ఫిజిక్ తో చురుకైన చూపుల‌తో వేగంగా క‌దిలే బాడీ లాంగ్వేజ్ తో మ‌గువ‌ల‌ గుండెల్లో నిదురించిన అత‌డి స్టైల్ కి సాహో అన‌కుండా ఉండ‌లేం.

ఇప్పుడే ట్రాయ్ ని.. బ్రాడ్ ని ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వ‌స్తోంది అంటే.. ఇదిగో ఇక్క‌డ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఇచ్చిన ఫోజు ఆ రేంజులోనే ఉంది మ‌రి. సూదంటు ముక్కు.. పొడ‌వాటి గిర‌జాల జుత్తు.. చురుకైన చూపు.. ఒడ్డు పొడ‌వు అన్నీ స‌మ‌కుదిరిన రోమ‌న్ (గ్రీకు)వీరుడిలా ఉన్నాడు ఈ గెట‌ప్ లో. అందుకేగా మెగా ఫ్యాన్స్ ప్రిన్స్ అని బిరుదునిచ్చింది. అయితే సూటు బూటు వేసిన గ్రీకువీరుడిలా వ‌రుణ్ ఇచ్చిన ఫోజు బ్ర‌హ్మ‌చారిణుల‌ క‌ల‌ల్లో క‌ల్లోల‌మేన‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎఫ్ 2లో హ‌నీ అయినా .. తొలి ప్రేమ‌లో రాశీ అయినా వ‌రుణ్ అంటే అంత ఇదిగా ఎందుకు ఫిదా అయిపోయారో ఇప్పుడైనా అర్థ‌మైందా?  ఇంత‌మంది త‌న వెంట ప‌డుతున్నా ఫిదా బ్యూటీ సాయిప‌ల్ల‌వినే పెళ్లాడేస్తాన‌ని ఇంట‌ర్వ్యూలో అన్నాడంటే అర్థం చేసుకోవాలి మ‌రి!

ప్ర‌ఖ్యాత ప్రొవోక్ క‌వ‌ర్ పేజీపై వ‌రుణ్ తేజ్ ఇచ్చిన ఫోజు రియ‌ల్లీ సూప‌ర్భ్ అన్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ముఖ్యంగా అత‌డి వేష‌ధార‌ణ స్టైల్ ఆకట్టుకున్నాయి. మొన్న‌నే గుబురుగ‌డ్డం కోర‌మీసాల‌తో ర‌గ్గ్ డ్ లుక్ లో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ అలియాస్ వాల్మీకిగా క‌నిపించిన వ‌రుణ్ త‌దుప‌రి చిత్రంలో ఎలా క‌నిపించ‌బోతున్నాడు? అన్న‌ది వేచి చూడాలి.


Tags:    

Similar News