రొటీన్ కథలకు భిన్నంగా తొలి అడుగులోనే ఘాజీ లాంటి సినిమా తీసి అందరి ప్రశంసలు అందుకున్నాడు డైరెక్టర్ సంకల్స్ రెడ్డి. దేశభక్తి నిండిన కథాంశం కావడంతోపాటు ఒక సబ్ మెరైన్ లో సాగే (అండర్ వాటర్) తొలి సినిమాగా ఘాజీ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఈ మూవీలో అందరినీ ఆకట్టుకుంది సబ్ మెరైన్ సెట్. అసలైన సబ్ మెరైన్ కు ఏమాత్రం తీసిపోని విధంగా సెట్ వేయడమంటే సామాన్యమైన విషయమేం కాదు. కానీ లిమిటెడ్ బడ్జెట్ లోనే బ్రహ్మాండమైన సెట్ వేసి అందరినీ మెప్పించారు.
డైరెక్టర్ సంకల్స్ ఘాజీ తరవాత రెండో అడుగులోనూ వైవిధ్యమైన కథనే ఎంచుకున్నాడు. ఈసారి అంతరిక్షం సాగే కథతో సినిమా తెరకెక్కించబోతున్నాడు. ఫిదా.. తొలిప్రేమతో వరస హిట్లతో జోరుమీదున్న మెగా హీరో వరుణ్ తేజ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం జార్జియా దేశంలో స్పేస్ స్టేషన్ సెట్ వేస్తున్నారు. ఓ టీం ప్రస్తుతం ఆ సెట్ వేసే పనిలోనే బిజీగా ఉంది. ఘాజీ లాగే ఇందులోనూ ఈ సెట్ చాలా కీలకం కానుంది. అచ్చు స్పేస్ లా కనిపించేందుకు ప్రత్యేకంగా చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారు. శ్రీహరికోటలోని ఇస్రో స్పేస్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా స్టోరీ సాగుతుంది.
హీరో వరుణ్ తేజ్ కు యాక్టర్ మంచి పేరు తెచ్చిపెట్టిన కంచె సినిమా కూడా జార్జియాలోనే తీశారు. మొదటి ప్రపంచయుద్ధం నాటి కథతో ఆ సినిమా సాగుతుంది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమా కోసం వరుణ్ మరోసారి జార్జియా వెళ్లనున్నాడు. సెంటిమెంటల్ గానూ ఇది వరుణ్ కు కలిసొచ్చే అంశమే అనుకోవచ్చు. రాజీవ్ రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.