మెగా టైటిల్ - రిలీజ్ డేట్ 15 న చెప్తారట!

Update: 2018-08-12 13:43 GMT
'ఘాజి' తో అందరినీ మెప్పించిన సంకల్ప్ రెడ్డి మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ హీరోగా ఒక స్పేస్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  డైరెక్టర్ క్రిష్ - సాయిబాబు జాగర్లమూడి - రాజీవ్ రెడ్డి కలిసి ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.   ఈ సినిమాగురించి ఒక కీలకమైన అప్డేట్ బయటకు వచ్చింది. 

ఈ సినిమా టైటిల్ - రిలీజ్ డేట్ ను ఆగష్టు 15 వ తేదీ ఉదయం 9.30 కు ప్రకటిస్తామని ఫిలిం యూనిట్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'అంతరిక్షం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని, దాదాపు గా అదే టైటిల్ ఖాయమైందని ఇప్పటికే వార్తలు వచ్చాయి సో.. అది కరెక్టా కాదా అనే విషయం పై ఇండిపెండెన్స్ డే రోజున మనకు క్లారిటీ వస్తుంది. ఈ సినిమా కోసం స్పెషల్ గా జీరో గ్రావిటీ సెట్స్ ను హలీవుడ్ నిపుణుల సాయం తో డిజైన్ చేసి అందులో స్పేస్ సీన్స్ ను షూట్ చేయడం జరిగిందట. 

ఇప్పటికే 'ఘాజి' సినిమాలో సబ్ మెరైన్ సెట్ లో షూట్ చేసి అందరినీ థ్రిల్ చేసిన సంకల్ప్ రెడ్డి ఇప్పుడు మరో సై ఫై థ్రిల్లర్ తో మరోసారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయడం విశేషం.  ఈ సినిమాలో అదితి రావు హైదరి - లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లు గా నటిస్తున్నారు.


Tags:    

Similar News