భావ ప్రకటనా స్వేచ్చ అందరికి సమానంగానే ఉంటుంది కాని సినిమా స్టార్స్ కు మాత్రం సోషల్ మీడియాలో కొన్ని పరిమితులు ఉంటాయి. అంటే నెటిజెన్ల అంచనాలకు అనుగుణంగా ఉంటేనే ట్రాలింగ్ ని తప్పించుకోవచ్చు. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇది విజయ్ దేవరకొండకు మరోసారి అనుభవమవుతోంది. నిన్న ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే కొత్త సినిమా ట్రైలర్ ఒకటి రిలీజయ్యింది. స్వరూప్ దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ప్లస్ సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ మీద ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి.
దీని గురించి ప్రత్యేకంగా నాలుగైదు లైన్లలో ప్రస్తావిస్తూ విజయ్ దేవరకొండ ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసుకున్నాడు. మిలియన్ పైగా ఫాలోయర్స్ ఉన్న విజయ్ పోస్ట్ చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో వేరే చెప్పాలా .ఇందులో చెప్పుకోవడానికి ఏముందని అనుకోకండి. అక్కడే ఉంది ట్విస్ట్. సరిగ్గా రెండు రోజుల క్రితం విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ డెబ్యు మూవీ దొరసాని టీజర్ వచ్చింది. వ్యూస్ భారీగానే వస్తున్నాయి. కాని విజయ్ దేవరకొండ కనీసం ఓ ముక్క కూడా దాని గురించి చెప్పడం కాని టీజర్ షేర్ చేయడం కాని చేయలేదు.
సైలెంట్ గా ఉన్నాడు. ఇదే ఇప్పుడు ట్రాలింగ్ కు ఛాన్స్ ఇచ్చేసింది. స్వంత తమ్ముడు మొదటి సినిమా కాబట్టి ప్రోత్సాహం ఇవ్వడంలో తప్పు లేదని బయట సినిమాకు ప్రమోట్ చేసి ఇలా సోదరుడికి హ్యాండ్ ఇవ్వడం ఏమిటని రకరకాల మేమ్స్ ని తయారుచేసి ఆన్ లైన్ లో వదిలారు. ఇప్పుడివి వైరల్ అవుతున్నాయి. మరో ట్విస్ట్ ఏంటంటే దొరసాని నిర్మాతల్లో ఒకరైన యష్ రంగినేని స్వయానా విజయ్ బంధువే. మరి దొరసాని గురించి విజయ్ ఎందుకు మౌనాన్ని ఆశ్రయించాడో అన్నదమ్ములకే తెలియాలి