వీడియో : జబర్దస్త్‌ కాపీ 'అదిరింది'

Update: 2019-12-19 07:48 GMT
ఈటీవీలో సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతున్న కామెడీ షో జబర్దస్త్‌ కు పోటీగా పలు కామెడీ షోలు వచ్చాయి. కాని ఏ ఒక్కటి నిలబడలేక పోయాయి. అయితే జబర్దస్త్‌ నుండి బయటకు వచ్చిన మెగా బ్రదర్‌ నాగబాబు మరియు జబర్దస్త్‌ మాజీ కమెడియన్స్‌ కలిసి చేయబోతున్న 'అదిరింది' కామెడీ షో పై అందరి దృష్టి కేంద్రీకృతం అయ్యి ఉంది. అదిరింది మొదటి ప్రోమోతో జబర్దస్త్‌ కు కౌంటర్స్‌ ఇచ్చిన నాగబాబు నిన్న విడుదలైన మరో ప్రోమోతో జబర్దస్త్‌ నే దించేశాడని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

'అదిరింది' సెట్టింగ్‌ నుండి కామెడీ పంచ్‌ ల వరకు అన్ని కూడా జబర్దస్త్‌ కు కాపీ అన్నట్లుగా ఉన్నాయి. మొదటి ఎపిసోడ్‌ జడ్జ్‌ లుగా నాగబాబు మరియు ఆయన కూతురు నిహారికలు వ్యవహరించబోతున్నారు. నాగబాబుతో పాటు వారం వారం జడ్జ్‌ లు మారుతూ ఉంటారేమో. మొదటి వారం కనుక మెగా డాటర్‌ నిహారిక వచ్చింది. ఇక యాంకర్‌ గా బుల్లి తెరపై ఇప్పటికే చాలా ఏళ్లుగా కనిపిస్తూ వస్తున్న సమీరాను తీసుకోవడం జరిగింది. జబర్దస్త్‌ కు యాంకర్స్‌ గ్లామర్‌ చాలా ప్లస్‌ గా ఉంటుంది. కాని సమీరా అనసూయ మరియు రష్మిక రేంజ్‌ లో అదిరిందికి ప్లస్‌ అవుతుందా లేదా చూడాలి.

ఇక కమెడియన్స్‌ గురించి మనం ముందే చెప్పుకున్నట్లుగా ధన్‌ రాజ్‌.. వేణు.. రచ్చ రవి మరియు చంద్రలు ఈ షోలో టీం లీడర్లుగా వ్యవహరించబోతున్నారు. జబర్దస్త్‌ లో ఎలా అయితే స్కిట్‌ లు ఉంటాయో అచ్చు అలాగే ఇందులో కూడా ఉండబోతుంది. పోగ్రాం డిజైనింగ్‌ మొత్తం అలాగే ఉండబోతుంది. జబర్దస్త్‌ కామెడీ షో ను ఢీ కొట్టాలంటే ప్రయోగాలు పని చేయవు. దాన్నే కాపీ కొట్టాలని 'అదిరింది' టీం భావించినట్లుగా ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఆదివారం ప్రసారం కాబోతున్న మొదటి ఎపిసోడ్‌ తర్వాత 'అదిరింది' భవిష్యత్తు ఏంటీ అనే విషయం తెలిసి పోతుంది.

Full View


Tags:    

Similar News