వీరసింహారెడ్డి కలెక్షన్స్.. లెక్క తేలాల్సింది ఈ రోజే!

Update: 2023-01-16 07:30 GMT
నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. క్రాక్ సినిమా తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ తోనే భారీ స్థాయిలో రికార్డును క్రియేట్ చేసింది. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే మొదటి రోజు అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా కూడా వీర సింహారెడ్డి రికార్డును క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమా నాలుగు రోజుల్లో కలెక్షన్స్ బాగానే అందుకున్నప్పటికీ కూడా టార్గెట్ పెద్దది కావడంతో ఈరోజు చాలా కీలకం కానుంది. మూడు రోజుల పాటు హాలిడేస్ ఉండడం వలన సినిమాకు బాగా కలిసి వచ్చింది. మొదటిరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 25.35 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా రెండవ రోజు 5.25 కోట్లను దక్కించుకుంది.

ఇక మూడవరోజు అంతకంటే ఎక్కువగా 7.25 కోట్లు వచ్చాయి. నాలుగు రోజుల్లో ఓవర్సీస్ లో ఈ సినిమా 4.80 కోట్ల వరకు అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా నాలుగు రోజుల్లో 52.65 కోట్లు షేర్ కలెక్షన్స్ 88.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. వీరసింహారెడ్డి సినిమా మొత్తంగా 73 కోట్ల వరకు బిజినెస్ చేసింది. అంటే ఈ సినిమా టార్గెట్ 74 కోట్లు.

ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ బట్టి చూస్తే ఇంకా ఈ సినిమా 21.35 కోట్ల షేర్ అందుకోవాల్సిందే. కొంత డివైడ్ టాక్  వచ్చినప్పటికీ కూడా కలెక్షన్స్ అయితే శని ఆదివారాలు అసలు తగ్గలేదు. ఇక సోమవారం కూడా పండగ వాతావరణం కావడంతో మరింత కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే రేపటికి మాత్రం కలెక్షన్స్ ఎంతవరకు స్టాండర్డ్ గా ఉంటాయో చెప్పలేము. దానికి తోడు వీర వాల్తేరు వీరయ్య సినిమాకు కలెక్షన్స్ మరింత పెరుగుతున్నాయి. మరి ఈ పోటీలో బాలయ్య ఎంతవరకు సేఫ్ జోన్ లోకి తీసుకువస్తాడో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News