ఈమద్య కాలంలో ఏ సినిమా అయినా రెండు మూడు వారాలు ఆడటమే గొప్ప. 50 డేస్ ఆడింది అంటే అది చాలా పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. అలాంటిది 106 సెంటర్స్ లో 50 రోజులను 'ఎఫ్ 2' చిత్రం పూర్తి చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో వచ్చినా కూడా థియేటర్లలో శని, ఆది వారాల్లో పెద్ద ఎత్తున కలెక్షన్స్ నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 106 థియేటర్లలో ఇంకా ప్రదర్శింపబడుతోంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 65 సెంటర్స్ లో నేరుగా 50 రోజులు పూర్తి చేసుకుందని మరి కొన్ని ఏరియాల్లో రీ రిలీజ్ అయ్యిందట. ఈమద్య కాలంలో 50 రోజులు పూర్తి చేసుకున్న అతి తక్కువ సినిమాల్లో ఇది ఒకటి. పైగా ఇన్ని ఎక్కువ థియేటర్లలో ఈ చిత్రం 50 డేస్ ఆడటం మరింత పెద్ద రికార్డుగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం 140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది.
సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా మంచి లాభాలను తెచ్చి పెట్టింది. 83 కోట్లకు పైగా షేర్ ను దక్కించుకున్న ఈ చిత్రం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ సక్సెస్ మూవీగా నిలిచింది. ఇంకా ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఈ ఏడాది టాక్ చిత్రాల్లో ఎఫ్ 2 స్థానం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. వెంకటేష్ - వరుణ్ తేజ్ లు కలిసి నటించిన ఈ చిత్రానికి అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఎఫ్ 2కు సీక్వెల్ ఎఫ్ 3 చిత్రంకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి.