యేడాది పాటు వచ్చిన గ్యాప్ ని ఫుల్ ఫిల్ చేయాలనుకుంటున్నాడు వెంకటేష్. ఒకేసారి రెండు మూడు చిత్రాలకి పచ్చజెండా ఊపేసి రంగంలోకి దిగబోతున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేస్తున్నాడు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. దాంతోపాటు రెండు కొత్త కథలకి కూడా ఓకే చెప్పేశాడని రామానాయుడు కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతలో మరో కథ కూడా అఫీషియల్ గా కన్ ఫర్మ్ అయ్యింది. మాధవన్ కథానాయకుడిగా హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కిన `సాలా ఖుద్దూస్` తెలుగు రీమేక్‌లో నటించేందుకు వెంకీ ఓకే చెప్పేశాడు. ఇటీవలే ఆ సినిమా చూసిన వెంకీ చాలా ఇంప్రెస్ అయ్యాడట. కథ ఆయన మనసును ఎంతగానో కరిగించిందట. దీంతో వెంటనే ఈ సినిమాని రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడట. హిందీలో ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ నిర్మించారు. సుధ కొంగర దర్శకత్వం వహించారు. తెలుగులో కూడా సుధ కొంగరనే దర్శకత్వం వహిస్తారని తెలిసింది.