దగ్గుబాటి రానా ఎట్టకేలకు తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పబోతున్నాడు. మిహికా బజాజ్ తన ప్రేమను అంగీకరించిందని రానా సోషల్ మీడియా ద్వారా వెల్లడించి సంచలనం సృష్టించాడు. ఈ మేరకు మిహికాతో కలిసి దిగిన ఫొటోను సైతం సంతోషంగా షేర్ చేశాడు. మిహికా బజాజ్ హైదరాబాద్ కి చెందిన యువతి. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న రానా.. ఓ ఇంటివాడు కాబోతుండటంతో సినీ ప్రముఖులు అందరూ రానాకు శుభాకాంక్షలు తెలియజేసారు. రానా - మిహిక బజాజ్ వివాహం ఈ ఏడాదిలోనే ఉంటుందని కుటుంబ సభ్యులు కూడా క్లారిటీ ఇచ్చేశారు. మిహికా కుటుంబ సభ్యులు కూడా వీరి సంతోషం వ్యక్తం చేసారు. ఇప్పటి నుండే పెళ్లి పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నామని.. లాక్ డౌన్ ముగిసిన తర్వాత డిసెంబర్ కు ముందే పెళ్లి ఉండే అవకాశముందని రానా తండ్రి సురేష్ బాబు వెల్లడించారు.
అయితే మిహీక కుటుంబానికి మరియు దగ్గుబాటి కుటుంబానికి ఎప్పటి నుండో సాన్నిహిత్యం ఉందట. మిహీక తల్లి బంటీ బజాజ్ పలు చిత్రాలకు పనిచేసిన నగల డిజైనర్ అని తెలుస్తోంది. ఆమె 'నాగవల్లి' సినిమాలో వెంకటేష్ మరియు అనుష్క ఆభరణాలను డిజైన్ చేసిందట. అప్పట్లో మిహీక బజాజ్ కూడా తన తల్లికి సాయం చేసేదట. ఆ రకంగా బాబాయ్ వెంకటేష్ కు అబ్బాయ్ రానాకి కాబోయే భార్యకు అప్పుడే పరిచయమట. ప్రస్తుతం మిహికా ముంబైలోని డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరిట ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థను నిర్వహిస్తోంది. మిహిక ముంబాయిలోని రచన సంసద్ విద్యాలయం నుంచి ఇంటీరియల్ డిజైనింగ్ లో డిప్లొమా అందుకుంది. అంతేకాదు లండన్ లోని చెల్సియా యూనివర్సిటీలో ఆర్ట్ అండ్ డిజైనింగ్ లో మాస్టర్ డిగ్రీ చేసింది.
ఇకపోతే రానా ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'హాతి మేరీ సాతి' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తెలుగులో 'అరణ్య' గా రానుంది. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉన్నా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. రానా నటిస్తున్న మరో చిత్రం 'విరాటపర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'విరాటపర్వం' లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత మిగతా షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు.