తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది హీరోలు డైరెక్షన్, ఎడిటింగ్ తదితర విభాగాల్లో చేతులు పెడుతుంటారు. కానీ, విక్టరీ వెంకటేష్ ది ఓ ప్రత్యేకమైన పర్సనాలిటీ. ఒక్కసారి వెంకీ సినిమా ఒప్పుకుంటే ఆ కథలో గానీ, షూటింగ్ లో గానీ ఇంటర్ ఫీర్ అవ్వడు అని ఇండస్ట్రీ టాక్. అయితే, రాణా హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ లో వెంకీ జోక్యం చేసుకున్నాడనే వార్త టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. దగ్గబాటి ఫ్యామిలీ ఈ చిత్రాన్నిపూర్తిస్థాయిలో ప్రేక్షకులకు నచ్చేలాగా రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
సొంత బ్యానర్ లో రాణాతో ఓ సినిమా చేయాలని నిర్మాత సురేష్ బాబు చాలాకాలంగా అనుకుంటున్నారు. తేజ చెప్పిన కథ నచ్చడంతో నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు సురేష్ బాబు. అయితే, ఈ సినిమాపై విక్టరీ వెంకటేష్ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించారట. ఈ విషయాన్ని స్వయంగా రాణా వెల్లడించాడు. ఇటీవల నిర్వహించిన జోగేంద్ర యువ గర్జన కార్యక్రమంలో వెంకటేష్ కనిపించకపోవడంతో యాంకర్ బిత్తిరి సత్తి ఆరా తీశాడు. బాబాయ్ వెంకటేశ్ .. ప్రస్తుతం నేనే రాజు నేనే మంత్రి ఎడిటింగ్‌లో బిజీగా ఉన్నారని చెప్పాడు. బాబాయ్ కు యాక్టింగ్‌లోనే కాకుండా అన్ని విభాగాలపై పట్టు ఉందని చెప్పాడు.
వెంకటేష్ రాణాతో చాలా సన్నిహితంగా ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. వారిద్దరూ బాబాయ్, అబ్బాయ్ లా కాకుండా స్నేహితులలాగా మెలుగుతారు. గతంలో కూడా సినిమాల కథ, పాత్రల ఎంపిక విషయంలో రాణాకు వెంకటేష్ సలహాలు, సూచనలు ఇచ్చాడు. టాలీవుడ్ కు ఎన్నో బ్లాక్ బస్టర్స్ ను అందించిన సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి వస్తున్న నేనే రాజు నేనే మంత్రి ని గొప్ప చిత్రంగా మలచాలని దగ్గుబాటి ఫ్యామిలీ ప్రయత్నిస్తోందని టాక్.
తేజ దర్శకత్వం వహిస్తున్న నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రాణా అనంతపురానికి చెందిన వడ్డీ వ్యాపారి జోగేంద్ర పాత్రలో నటిస్తున్నాడు. జోగేంద్ర భార్య రాధ పాత్రలో కాజల్ నటిస్తోంది. ఓ వడ్డీ వ్యాపారి ఏ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందనే నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. పరుచూరి బ్రదర్స్ ఈ చిత్రానికి పదునైన స్క్రీన్‌ప్లే అందించగా, లక్ష్మీ భూపాల్ మాటలు సమకూర్చారు. ఇప్పటికే ఈ చిత్రంలోని డైలాగ్స్ కు విశేష స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11న విడుదల కానున్న ఈ చిత్రానికి జయ జానకి నాయక, లై చిత్రాల నుంచి గట్టిపోటీ ఎదురవబోతోంది. అయితే ఈ చిత్ర విజయం పై దగ్గబాటి ఫ్యామిలీతో సహా, చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. మరోవైపు ఇండిపెండెన్స్ వీకెండ్ ను క్యాష్ చేసుకోవడానికి ఒకే రోజున పోటాపోటీగా 3 సినిమాలను రిలీజ్ చేయడంపై టాలీవుడ్‌లో అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.