`కేరాఫ్ కంచరపాలెం` అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు వెంకట్ మహా. తొలి సినిమాతోనే విమర్శలకు ప్రశంసలందుకున్నాడు. వాస్తవ జీవితాలను కళ్లకు కడుతూనే ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లేని వెంకట్ మహా ప్రెజెంట్ చేసిన తీరు అందరికీ నచ్చింది. సినిమా చూస్తోన్న ఫీలింగ్ లేకుండా వాస్తవ జీవితాలే మన కళ్ల ముందు ఉన్నాయా? అన్నంత గొప్పగా కల్ట్ సినిమా చేసాడు. అందుకే తొలి సినిమాతోనే మంచి మేకర్ గా నిరూపించుకోగలిగాడు. లక్కీగా స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు- రానా బృందం కేరాఫ్ కంచరపాలెం రిలీజ్ కి సాయం చేయడం కలిసొచ్చింది.
ఈ సక్సెస్ తోనే అతనిలో ట్యాలెంట్ ని గుర్తించి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ సదరు యువదర్శకుడు వెంటనే వేరొక చిత్రానికి సంతకం చేయలేదు. ఫిలిం మేకింగ్ పై ఇంకా పట్టు సాధించాలని అమెరికాలో ప్రత్యేకంగా డైరెక్షన్ కోర్స్ పై కొన్నాళ్ల పాటు శిక్షణ తీసుకునే ఆలోచన ఉందని అప్పట్లో వెల్లడించాడు. తాజాగా నిన్నటి రోజున వెంకట్ మహాతో సినిమా చేస్తున్నట్లు బాహుబలి నిర్మాతలు (ఆర్కా మీడియా) శోభు యార్లగడ్డ సంచలన ప్రకటనతో పాటు.. సినిమా థీమ్ ని కూడా రివీల్ చేసారు. అందులో సత్య హీరోగా నటిస్తున్నాడు. తొలి ప్రీ టీజర్ తోనే వెంకట్ మరోసారి ఇండస్ట్రీని ఆకర్షించాడు. టీజర్ కు మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది.
మహాలో ట్యాలెంట్ ని గుర్తించి ఆర్కా మీడియా కేరాఫ్ కంచరపాలెం రిలీజ్ తర్వాత అతడిని ఎంకరేజ్ చేసింది. వెంకట్ లో ప్రతభకు మెరుగులు దిద్దేందుకు అమెరికాలో డైరెక్షన్ పై టాప్ మోస్ట్ స్కూల్లో శిక్షణ ఇప్పించిందని పరిశ్రమలో చర్చ సాగుతోంది. ఆర్కా మీడియా ప్రోద్బలంతోనే వెంకట్ మహా మేకింగ్ లో రాటు తేలాడట. మరి ఇందులో నిజం ఎంత? అన్నది అతడే వెల్లడించాల్సి ఉంది. అదే నిజమైతే టాలీవుడ్ లో ట్యాలెంట్ ని గుర్తించి ప్రోత్సహించిన సంస్థగా ఆర్కాకి ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. అయినా వన్ ఫిలింవండర్ కి పిలిచి రెండో ఛాన్స్ ఇచ్చినప్పుడే ఆ సంస్థ గొప్పతనం ఎలాంటిది అన్నది బయటపడింది.