డోనరుడికి వెంకీ మార్కు ప్రమోషన్

Update: 2016-11-02 12:45 GMT
తన కొత్త సినిమా ‘నరుడా డోనరుడా’ విషయంలో పక్కా ప్రణాళికతో ఉన్నట్లున్నాడు సుమంత్. ఈ సినిమాకు అనుకోకుండా పాజిటివ్ బజ్ రావడంతో.. ప్రమోషన్ జోరు పెంచి మంచి హైప్ మధ్య సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ట్రైలర్ లాంచ్ చేయించాడు. మావయ్య నాగార్జునతో పాటు అఖిల్ ను ఆడియో వేడుకకు పిలిపించాడు. ఇంకా మరి కొందరు సినీ ప్రముఖుల్ని కూడా రంగంలోకి దించుతున్నాడు. సుమంత్ కోసం సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ‘నరుడా డోనరుడా’ను ప్రమోట్ చేయడానికి ముందుకు రావడం విశేషం.

వెంకీ తనదైన శైలిలో ‘నరుడా డోనరుడా’కు విషెస్ చెప్పారు. ‘‘దేవుడా.. ఓ మంచి దేవుడా.. మా సుమంత్ సినిమా ‘నరుడా డోనరుడా’ చాలా మంచి విత్తనాలు ప్రొడ్యూస్ చేయాలని.. చాలా స్ట్రాంగ్ విత్తనాలు ప్రొడ్యూస్ చేయాలని.. అవి ఒక వారం.. నాలుగు వారాలు కాకుండా వంద రోజుల పాటు విత్తనాలు ప్రొడ్యూస్ చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన సుమంత్ సినిమా ‘నరుడా డోనరుడా’ నవంబరు 4 నుంచి 100 రోజుల పాటు విత్తనాలు ప్రొడ్యూస్ చేస్తూనే ఉండాలి’’ అని విష్ చేస్తూ.. ‘నువ్వునాకు నచ్చావ్’లోని ఫేమస్ డైలాగ్ ను గుర్తు తెచ్చాడు వెంకీ. సుమంత్ కోసం వెంకీ ఇలా ముందుకొచ్చి ఇలా విష్ చేయడం విశేషమే.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News