కండలు పెంచితే తిరుమల పరిస్థితేంటి?

Update: 2016-02-29 16:40 GMT
సీనియర్‌ హీరో వెంకటేష్‌ ఇప్పుడు వరుసగా సినిమాలు చేద్దాం అని డిసైడ్‌ అయ్యాడు. మొన్నటివరకు గోపాల గోపాల రిలీజ్‌ అయ్యాక కేవలం 9 నెలలపాటు అసలు ఏ స్ర్కిప్టు ఓకె చేయాలా అనే సతమతంలో ఉంటే.. ఇప్పుడు ఏకంగా 3 సినిమాలు బ్యాక్‌ టు బ్యాక్‌ చేస్తున్నాడు. అంతే కాదు.. ఏకంగా ఫిజిక్‌ ను మార్చుకొని మరీ ఇంప్రెస్‌ చేయాలని ఫిక్సయ్యాడు.

ఆల్రెడీ మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు వెంకీ. దీనికి అనుకుంటున్న టైటిల్‌ ''బాబూ బంగారం'' అని తెలిసిందే. ఆ సినిమా తరువాత ''నేను శైలజ'' ఫేం తిరుమల కిషోర్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి సైన్‌ చేసేశాడు. ఇవన్నీ ఒకత్తెయితే ఇక మాధవన్‌ హీరోగా హిందీలో వచ్చిన ‘సాలా ఖడూస్‌’ రీమేక్‌ మరో ఎత్తు. అయితే ఈ సినిమాలో పోషించనున్న బాక్సింగ్‌ కోచ్‌ పాత్రకి తగ్గట్టుగా సిద్ధమయ్యేందుకు ముందుగా వెంకీ చాలా ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడట.  ఇప్పటికే బాబూ బంగారం సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తవ్వడంతో ఇప్పుడు జిమ్‌ లోనే ఎక్కువగా టైమ్‌ స్పెండ్‌ చేస్తున్నాడు వెంకీ. ఆ పాత్ర కోసం బరువు పెరగనున్నాడు. మాధవన్‌ టైపులోనే కండలు తిరిగిన బంటులా.. ఒక సూపర్బ్‌ కిక్‌ బాక్సర్‌ లా మారిపోతాడట. సినిమాలో షర్టు లెస్‌ సీన్లను కూడా చూపనున్నారు కాబట్టి.. వెంకీ ఇప్పుడు బాడీ మీదనే ఫోకస్‌ పెట్టేశాడు. గెట్‌ రెడీ ఫర్‌ న్యూ వెంకీ.

అంతా బాగానే ఉంది కాని.. మరి కండలు పెంచి సాలా కడూస్‌ కోసం టైమ్‌ కేటాయిస్తే.. కిషోర్‌ తిరుమల సినిమా పరిస్థితి ఏంటి? అందుకే వేరే హీరోతో సినిమాను మొదలెట్టుకుందాం అని చూస్తున్నాడట నేను శైలజ డైరక్టర్.
Tags:    

Similar News