ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజ్ఞాతవాసి ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిమానులు ఈ సినిమా కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ మొత్తానికి మొదటి టాక్ తో అజ్ఞాతవాసి విమర్శకులకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాతో పండగని హ్యాపీగా ఎంజాయ్ చేద్దామనుకున్న అభిమానులకు కొంత నిరాశను మిగిల్చింది. అయితే పవన్ కళ్యాణ్ కి అపజయాలు కొత్తేమి కాదు. సినిమాలకు సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిన సంగతి తెలిసిందే.
ఓ వర్గం అభిమానులు అయితే.. పోతే పోనీ ఎప్పటికైనా మా బాస్ పవర్ స్టారే అని నిజమైన ఫ్యాన్స్ అనిపించుకుంటున్నారు. ఇకపోతే నెగిటివ్ టాక్ కలెక్షన్స్ ని ఏ స్థాయి వరకు ఆపుతుందో అని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అన్నిటికంటే ఇప్పుడు ఎక్కువగా అందరిని షాక్ కి గురి చేస్తోన్న విషయం ఒక్కటే. సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ చేసాడని రిలీజ్ ముందు వరకు చాలా హంగామా చేశారు కదా! మరి సినిమాలో ఎందుకు లేడు అని మాట్లాడుకుంటున్నారు. అంతే కాకుండా సినిమా ఆరంభానికి ముందు థ్యాంక్స్ కార్డ్ కూడా వేశారు. ఈ విషయం ఆల్రెడీ చెప్పుకున్నాం.
అయితే రీసెంట్ గా వచ్చిన టాక్ ప్రకారం.. సెకండ్ వీక్ నుంచి వెంకీకి సంబందించిన సీన్స్ ని యాడ్ చేస్తారు అనే టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఒక వేళ రిలీజ్ చేస్తే ఏమైనా లాభం ఉంటుందా అనే అనుమానం కూడా కలుగుతోంది. అసలే సినిమాకు డివైడ్ టాక్ వచ్చేసింది. పాజిటివ్ టాక్ వస్తే ఆలస్యంగా ప్రచారం జరుగుతుందో ఏమో గాని నెగిటివ్ టాక్ వస్తే మాత్రం ఓ రేంజ్ లో పొల్యూట్ అయిపోతుంది. మరి ఇలాంటి వాతావరణంలో ఆ సీన్ ని యాడ్ చేస్తే ఏమైనా లాభం ఉంటుందో లేదో చూడాలి.