వెంకీ.. చరణ్‌ మల్టీస్టారర్ జాతీయ అవార్డు డైరెక్టర్‌ ప్లాన్స్‌

Update: 2021-09-10 02:30 GMT
ఈమద్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఇంతకు ముందు స్టార్‌ హీరోలు మల్టీస్టారర్ సినిమాలకు ఇష్టపడేవారు కాదు. కాని ఇప్పుడు హీరోలు చాలా మెచ్యూర్డ్‌ గా ఆలోచిస్తున్నారు. మంచి సబ్జెక్ట్‌ లు ఉంటే మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు సిద్దం అన్నట్లుగా రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా లో ఎన్టీఆర్ మరియు రామ్‌ చరణ్ లు కలిసి నటిస్తున్నారు. త్వరలోనే ఆ సినిమా విడుదల కాబోతుంది. ఆ సినిమా తర్వాత మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు వస్తాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల తమిళ దర్శకులు తెలుగు లో సినిమాలు చేయడం చాలా కామన్‌ విషయంగా మారింది. శంకర్.. లింగు స్వామితో పాటు ఇంకా పలువురు దర్శకులు కూడా తెలుగు లో సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యారు. తాజాగా తమిళ మీడియాలో వస్తున్న వార్తలను అనుసారం జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్‌ తెలుగు లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.

వెట్రిమారన్‌ ప్రస్తుతం ఒక మల్టీ స్టారర్ సినిమా కోసం స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడట. దాన్ని తెలుగు హీరోలు వెంకటేష్ మరియు రామ్‌ చరణ్‌ లకు వినిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. వారిద్దరితో మల్టీ స్టారర్ సినిమాను చేసేందుకు వెట్రిమారన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది. వెట్రిమారన్‌ ను తెలుగు ప్రేక్షకులు గత కొంత కాలంగా కోరుకుంటున్నారు. ఆయన చిత్రాలు చాలా విభిన్నంగా ఉంటాయి. తప్పకుండా కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకుంటాయి అని అభిమానులు అంటూ ఉంటారు.

తెలుగు లో వెట్రిమారన్ ఎంట్రీ కోసం మరో స్క్రిప్ట్‌ ను కూడా రెడీ చేసుకుంటున్నాడట. దాన్ని ఎన్టీఆర్‌ తో చేయాలని కూడా ఇప్పటికే డిసైడ్‌ అయ్యాడట. కొన్నాళ్ల క్రితమే ఎన్టీఆర్ మరియు వెట్రిమారన్‌ మూవీ గురించిన వార్తలు వచ్చాయి. కాని ఎన్టీఆర్ బిజీగా ఉండటం వల్ల వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం వెట్రిమాన్‌ కథ రెడీ చేస్తే తప్పకుండా అది పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఆడుకాలం.. వడ చెన్నై మరియు అసురన్‌ సినిమాలను చేసిన ఈయన జాతీయ అవార్డు స్థాయి సినిమాలను ముందు ముందు కూడా చేస్తాడనే నమ్మకంతో అంతా ఉన్నారు. తెలుగు లో ఆయన చేయబోతున్న సినిమా కూడా జాతీయ అవార్డులను అందుకోవాలని ఆశిద్దాం.
Tags:    

Similar News