బాబీ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ - అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన మల్టిస్టారర్ చిత్రం 'వెంకీమామ' ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రియల్ లైఫ్ లో మేనమామ - మేనల్లుడు అయిన వెంకీ చైతు సినిమాలో కూడా అలాంటి పాత్రలే పోషించడం.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ కావడంతో ప్రేక్షకుల నుండి ఆదరణ దక్కుతోంది. రివ్యూస్.. మౌత్ టాక్ యావరేజ్ గానే ఉన్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులుపుతున్నాయి.
'వెంకీమామ' తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారాంతంలో రూ.17.72 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. మొదటి రెండు రోజులు మంచి కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం మూడవ రోజు కూడా అదే ఊపును కొనసాగించింది. ఈ సినిమాకు బీ.. సీ సెంటర్లలో ఎక్కువ ఆదరణ దక్కుతోందని ట్రేడ్ రిపోర్టులు చెప్తున్నాయి. అయితే సోమవారం నుంచి కలెక్షన్స్ ఇలానే ఉంటాయా లేక డ్రాప్ అవుతాయా అనేది వేచి చూడాలి.
తెలుగు రాష్ట్రాల్లో'వెంకీమామ' మొదటి వారాంతం కలెక్షన్స్ ఇవే.
నైజాం: 6.71 cr
ఉత్తరాంధ్ర: 2.28 cr
సీడెడ్: 3.36 cr
గుంటూరు: 1.12 cr
వెస్ట్: 0.82 cr
ఈస్ట్: 1.40 cr
నెల్లూరు: 0.63 cr
కృష్ణ: 1.04 cr
ఏపీ & తెలంగాణా టోటల్: 17.36 cr