వెంకీమామ రెండు రోజుల వసూళ్లు

Update: 2019-12-15 11:51 GMT
విక్టరీ వెంకటేష్ - అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన మల్టిస్టారర్ చిత్రం 'వెంకీమామ' నిన్నే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రియల్ లైఫ్ లో మేనమామ - మేనల్లుడు అయిన వెంకీ చైతు సినిమాలో కూడా అలాంటి పాత్రలే పోషించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి వ్యక్తమైంది. రివ్యూస్.. మౌత్ టాక్ యావరేజ్ గానే ఉన్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులుపుతున్నాయి..

రెండు రోజులకు గానూ 'వెంకీమామ'  ప్రపంచవ్యాప్తంగా రూ. 15.25 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది.  మొదటి రోజు వెంకీ- చైతు కెరీర్లలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం రెండవరోజు కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.  'వెంకీమామ' ఊపు చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర త్వరగానే బ్రేక్ ఈవెన్ దిశగా పయనించేలా ఉంది.  పోటీలో ఇతర సినిమాలు లేకపోవడం.. వెంకీ 'F2' సక్సెస్ లో ఉండడం.. చైతు 'మజిలీ' సక్సెస్ లో ఉండడంతో ఆ సక్సెస్ ఎఫెక్ట్ ఈ సినిమాపై కూడా కనిపిస్తోంది.

'వెంకీమామ' రెండు రోజుల కలెక్షన్స్ ఇవే.

నైజాం: 4.51 cr

ఉత్తరాంధ్ర: 1.58 cr

సీడెడ్: 2.45 cr

గుంటూరు: 0.72 cr

వెస్ట్: 0.53 cr

ఈస్ట్: 0.98 cr

నెల్లూరు: 0.43 cr

కృష్ణ: 0.69 cr 

ఏపీ & తెలంగాణా టోటల్: 11.88 cr

కర్ణాటక: 0.87 cr

రెస్ట్ అఫ్ ఇండియా: 0.53 cr 

ఓవర్సీస్: 2.00 cr

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు టోటల్: రూ. 15.28 cr
Tags:    

Similar News