ఓ సక్సెస్ సినిమా వాళ్లను ఆకాశానాకి ఎత్తేస్తుంది. ఓ ప్లాఫ్ ..అదే ఆకాశంలో ఉన్నవాళ్లను పాతాళంలోకి తొక్కేస్తుంది. ఏ ఫీల్డ్ లో లేనంత ఉద్దాన పతనాలు సినీ పరిశ్రమలోనే ఉన్నాయి. వకీల్ సాబ్ ప్రారంభం ముందుదాకా వేణు శ్రీరామ్ తో సినిమా అంటే దిల్ రాజు వెనక ఉన్నాడు కాబట్టి చూద్దాం అన్నారు. ఇప్పుడు ఫోన్స్ చేసి మరీ చాలా మంది నిర్మాతలు, హీరోలు తమకో సినిమా చేసి పెట్టమని అడుగుతున్నారట. వకీల్ సాబ్ ..ఏ స్దాయి హిట్ అనేది వేణు శ్రీరామ్ కు వస్తున్న ఆఫర్స్ ని బట్టే చెప్పేయచ్చు అంటున్నారు. ఈ నేపధ్యంలో వేణు శ్రీరామ్ తన తదుపరి చిత్రం ఏ హీరోతో చెయ్యబోతున్నారు అనేది పెద్ద స్పెక్యులేషన్ గా మీడియాలో మారింది.
అల్లు అర్జున్ తో ఐకాన్ ఎనౌన్స్ చేసారు కాబట్టి అదే పూర్తి చేస్తాడు అని ఓ వర్గం అంటోంది. వాస్తవానికి దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో 'ఐకాన్' చిత్రం ఉంటుందని ప్రకటించి ఇప్పటికే చాలా కాలం గడుస్తోంది. 2019లో దిల్ రాజు నుంచి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. అప్పటినుంచి వేణు శ్రీరామ్ ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. కారణాలేమో కానీ ఇప్పటివరకు 'ఐకాన్' పట్టాలెక్కలేదు. స్క్రిప్టు సరిగ్గా కుదరక వద్దనుకున్నాడని, అల్లు అర్జున్ డేట్స్ కుదరక అని ఇలా రకరకాల కారణాలు వినపడ్డాయి.
బన్నీ 'అలా వైకుంఠపురంలో' తరువాత 'ఐకాన్' సెట్స్ పైకి వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ ట్విస్ట్ ఇస్తూ సుకుమార్ తో 'పుష్ప మొదలెట్టేసాడు బన్నీ. దీంతో 'ఐకాన్' మళ్ళీ ప్రక్కకు వెళ్లిపోయింది. ఈలోగా పరిస్దితి గమనించిన దిల్ రాజు.. దర్శకుడు వేణు శ్రీరామ్ 'వకీల్ సాబ్' అప్పచెప్పాడు. ఆ ప్రాజెక్టుతో బిజీ అయిపోయాడు వేణు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్' బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వేణు శ్రీరామ్ 'ఐకాన్'పై మళ్లీ దృష్టి పెట్టాడట. అయితే వేణు శ్రీరామ్ 'ఐకాన్'గా ప్రభాస్ ను వెండి తెరపై చూపించాలని భావిస్తున్నాడట. అయితే అల్లు అర్జున్ డేట్స్ ఎంత కష్టమో...యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డేట్స్ పరిస్దితి సేమ్ టు సేమ్.
ఇప్పటికే పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. అయినా గతంలో దిల్ రాజు కు ప్రభాస్ డేట్స్ ఇస్తానని మాట ఇచ్చి ఉన్నాడు. దాంతో ఇప్పుడు వేణు శ్రీరామ్ తో 'ఐకాన్' ప్రాజెక్టుని ప్రభాస్ పట్టాలెక్కించాలని ఆయన భావిస్తున్నాడట. ప్రభాస్ 'ఐకాన్'కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దిల్ రాజు, వేణు శ్రీరామ్ ఇద్దరూ ఫుల్ ఖుషీ. మరి చూడాలి ఏం జరగనుందో.