షారూక్ ఖాన్ లేటెస్ట్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. షారూక్ ఆశించిన విధంగా.. ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగా మంచి మాస్ కంటెంట్ తో ఉండడంతో రయీస్ ఆకట్టుకుంటోంది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించేస్తోంది ఈ చిత్రం. అయితే.. హిట్ సంగతి అలా ఉంచితే.. ఈ మూవీ ద్వారా షారూక్ కి కొత్త తలనొప్పులు వస్తున్నాయి.
ఇప్పటికే ప్రచారంలో భాగంగా వడోదర రైల్వేస్టేషన్ లో తొక్కిసలాటకు కారణం అయ్యాడని.. ఓ వ్యక్తి మరణం షారూక్ కారణంగానే అని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ బాలీవుడ్ బాద్షాపై దేశద్రోహం కేసు నమోదు చేయాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. పాకిస్తాన్ నటి మహిరా ఖాన్ నటించిన రయీస్ ని నిషేధించాలంటూ.. శివ సేన.. వీహెచ్ పీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు.. ఈ మూవీలో షారూక్ చేసిన కేరక్టర్ కూడా వివాదాస్పదం అవుతోంది.
ఈ చిత్రంలో హింస మితిమీరి ఉండడం ఒక కారణం అయితే.. మరోవైపు ఈ సినిమాను గుజరాత్ కు చెందిన మాఫియా డాన్ అబ్దుల్ లతీఫ్ జీవితం ఆధారంగా రూపొందించారనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని నిషేధించడమే కాు.. ఏకంగా షారూక్ పై దేశద్రోహం కేసు పెట్టాలని శివసేన కార్యకర్తలు అంటున్నారు. ఇప్పటికే గుజరాత్ లోని పలు పట్టణాల్లో భారీగా నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి శివసేన.. వీహెచ్‌పీలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/