విద్యాబాలన్ ఎస్ అంటుందా??

Update: 2018-03-12 04:48 GMT
విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా తీయడానికి ఆయన కొడుకు.. హీరో బాలకృష్ణ సిద్ధమయ్యారు. నేనే రాజు.. నేనే మంత్రి సినిమాతో మంచి పొలిటికల్ సినిమా తీయగలడని గుర్తింపు తెచ్చుకున్న తేజను డైరెక్టర్ ఎంచుకున్నాడు. ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. రెగ్యులర్ షూటింగు ఇంకా మొదలుపెట్టడానికి టైం ఉంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ కాస్టింగ్ పై ఫోకస్ పెట్టింది.

ఎన్టీఆర్ జీవితంలో ఆయన భార్య బసవతారకానికి కీలక పాత్ర.  మరి ఈ రోల్ ఎవరిని ఫైనల్ చేయాలన్న దానిపై చాలా రోజులుగానే కుస్తీ పడుతున్నారు. చాలామంది హీరోయిన్ల పేర్లు పరిశీలనలోకి  వచ్చినా అవేవీ వర్కవుట్ అవలేదు. చివరకు ఈ రోల్ ను పాపులర్ బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ తో చేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. విద్యాబాలన్ జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ఉత్తమ నటి. ఎలాంటి పాత్రలోనైనా బాగా మెప్పించగలదు. అదీగాక ఎన్టీఆర్ భార్యగా హుందాగా కనిపించే పాత్రలో ఆమె నూటికి నూరుశాతం సూటవుతుంది. పైగా ఆమె హీరోయిన్ గా చేయడం సినిమాకు మరింత పాపులారిటీ తెస్తుంది.

ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ విద్యాబాలన్ ను కలిసి స్క్రిప్ట్ నెరేట్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె కూడా టాలీవుడ్ లో నటించేందుకు ఇది సరైన పాత్రగా భావిస్తోందని టాక్. ఆమె తెలుగులో చేసేందుకు భారీ మొత్తమే అడిగిందని.. ఆ మొత్తం ఇవ్వడానికి నిర్మాత బాలకృష్ణ సిద్ధంగానే ఉన్నారని చిత్ర యూనిట్ సభ్యుడొకరు తెలిపారు. మరి విద్య ఎస్ అంటుందా?
Tags:    

Similar News