ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక నయనతార వైపు నుంచి లవ్ స్టోరీలకి పుల్ స్టాప్ పడుతుందని ఊహించారంతా. కానీ అదేం జరగలేదు. చెప్పాలంటే అంతకుముందుకంటే ఎక్కువ కథలే వినిపించడండ మొదలుపెట్టాయి. యువ కథానాయకుడు ఆర్య మొదలుకొని పలువురితో ముడిపెడుతూ నయనతార పేరును ప్రచారం చేశారు. అందులో విఘ్నేష్ శివన్ ఒకరు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార `నేనూ రౌడీనే` అనే సినిమా ఎప్పుడైతే చేసిందో అప్పట్నుంచి వాళ్లిద్దరి మధ్య బంధం బలపడింది. ఇద్దరూ ఒకరిని విడిచి పెట్టి మరొకరు ఉండలేనంతగా దగ్గరయ్యారు. అంత దగ్గరైన ఆ ప్రేమపక్షులు కూడా కొంతకాలం క్రితం మళ్లీ దూరమైపోయారని, ఇద్దరూ బ్రేకప్ చెప్పుకొన్నారని వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదన్న విషయం తాజాగా బయటికొచ్చింది.
సింగపూర్ లో జరిగిన సైమా వేడుకల్లో నయనతార - విఘ్నేష్ శివన్ కలిసి పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరిగిన వేడుకల్లో అసలెప్పుడూ నయనతార విఘ్నేష్ ని వదిలిపెట్టి కనిపించలేదు. ఎక్కడికెళ్లినా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అక్కడ వాళ్లిద్దరినీ చూసినవాళ్లు ఈ బంధం ఇప్పుడిప్పుడే బీటలు వారేలా లేదని, తప్పకుండా పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టేంత అన్యోన్యత వాళ్లిద్దరిలో చెబుతున్నారు. సో.. నయన్ వినిపించే లవ్ స్టోరీ ఇదే ఆఖరిదన్నమాట.