తిరుమ‌ల అప‌చారంపై విఘ్నేష్ శివ‌న్ వివ‌ర‌ణ‌

Update: 2022-06-11 05:44 GMT
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార త‌ను ప్రేమించిన ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ ని ఎట్ట‌కేల‌కు జూన్ 9న బంధు ముత్రుల స‌మ‌క్షంలో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. మ‌ద్రాసు లోని మ‌హాబ‌లిపురంలోగ‌ల ఓ రిసార్ట్ లో వీరి పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఇరు కుటుంబాల‌కు చెందిన ఫ్యామిలీల‌తో పాటు బంధు మిత్రులు, కోలీవుడ్ స్టార్స్ , బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

పెళ్లి జ‌రిగిన మ‌రునాడే న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ తిరుమ‌ల తిరుప‌తి దేవ స్థాన‌న్ని సంద‌ర్శించింది. స్వామి వారికి ప్ర‌త్యేకంగా మొక్కులు చెల్లించుకుంది. ఇంత వ‌ర‌కు బాగానే వుంది అయితే స్దామివారి దర్శ‌నానికి ముందు ఈ జంట తిరుమ‌ల మాడ‌వీధుల్లో చెప్పులు ధ‌రించి తిరుగుతూ ప్ర‌త్యేకంగా ఫొటో షూట్ లు చేయ‌డం వివాదాస్ప‌దంగా మారింది. దీనిపై టీటీడీ పాల‌క మండ‌లి తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. ఇదే కాకుండా  స్వామివారి ప్ర‌ధాన ద్వారం ద‌గ్గ‌రే న‌య‌న‌, విఘ్నేష్ లు ఫొటో షూట్ లు చేయ‌డం మ‌రింత ఆగ్ర‌హాన్ని తెప్పించింది.

న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ చెప్పులు వేసుకుని ఫొటో షూట్ లు చేసిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైర‌ల్ కావ‌డంతో ఈ ఇద్ద‌రిపై ఆగ్ర‌మాన్ని వ్య‌క్తం చేస్తూ నెటిజ‌న్ లు విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో ఈ విష‌యం టీటీడీ పాల‌క మండ‌లి దాకా వెళ్లింది. ఇలా తిరుప‌తి ప‌విత్ర‌కు భంగం క‌లిగించేలా న‌య‌న‌తార దంప‌తులు వ్య‌వ‌హ‌రించార‌ని భ‌క్తుల మ‌రోభావాలు దెబ్బ‌తినేలా చేశార‌ని ఆగ్ర‌హించి వారికి నోటీసులు జారీ చేసింది. తాజా వివాదంపై విఘ్నేష్ శివ‌న్ స్పందించారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ లేఖ‌ని విడుద‌ల చేశారు.

తెలియ‌క జ‌రిగిన త‌ప్పిద‌మ‌ని, ఆ క్ష‌ణంలో మా కాళ్ల‌కు చెప్పులు వున్నాయ‌న్న సంగ‌తే మ‌ర్చిపోయామ‌న్నారు. మా త‌ప్పుని క్ష‌మించ‌మ‌ని కోరుతున్నారు. తిరుప‌తిలో పెళ్లి చేసుకోవాల‌ని ఎంతో కాలంగా అనుకున్నాం.

ఆ క్ర‌మంలోనే గ‌డిచిన 30 రోజుల్లో 5 సార్లు తిరుప‌తికి వ‌చ్చి వెళ్లాం. కొన్ని కార‌ణాల వ‌ల్ల అది సాధ్యం కాక‌పోవ‌డంతో మ‌హాబ‌లిపురంలోనే వివాహం చేసుకున్నాం. అయితే పెళ్లైన వెంట‌నే స్వామివారి క‌ల్యాణం వీక్షించి ఆయ‌న ఆశీస్సులు తీసుకోవాల‌ని అనుకున్నాం. అన్నారు.

అంతే కాకుండా అనుకున్న విధంగానే స్వామివారిని ద‌ర్శ‌నం చేసుకున్నామ‌ని, మా పెళ్లి ఇక్క‌డే జ‌రిగిందనే భావ‌న క‌లిగ‌డం కోసం ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా ఫొటో షూట్ చేసుకోవాల‌నుకున్నాం. ఆ స‌మ‌యంలో భ‌క్తులు ఎక్కువ‌గా వుండ‌టంతో తిరిగి వెల్లిపోయాం. మ‌ళ్లీ తిరిగి వ‌చ్చి ఫొటోషూట్ ని త్వ‌ర‌గా పూర్తి చేసుకోవాల‌న్న తొంద‌ర‌లో మా కాళ్ల‌కు చెప్పులు వున్నాయ‌న్న విష‌య‌మే మ‌ర్చిపోయాం. దేవుడిపై మాకు అపార‌మైన న‌మ్మ‌కం వుంది. మేము ఎంత‌గానో ఆరాధించే స్వామిని అవ‌మానించాల‌ని అలా చేయ‌లేదు. ద‌య‌చేసి మ‌మ్మ‌ల్ని క్ష‌మించండి' అంటే లేఖ‌లో పేర్కొన్నారు విఘ్నేష్ శివ‌న్‌.
Tags:    

Similar News