పుష్ప సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పెద్దగా ప్రమోషన్ చేయకుండానే హిందీ ప్రేక్షకులు పుష్ప సినిమాకు ఏకంగా 80 కోట్లకు పైగా వసూళ్లను కట్టబెట్టారు. కేవలం పుష్ప మాత్రమే కాకుండా సౌత్ నుండి ముఖ్యంగా తెలుగు నుండి ఏ సినిమా వచ్చినా కూడా ప్రస్తుతం బాలీవుడ్ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ సినిమాలు విడుదలకు సిద్దంగా లేవు. కరోనా వల్ల ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాలు 50 శాతం ఆక్యుపెన్సీ కండీషన్ ను పెట్టాయి. దానికి తోడు కరోనా భయంతో థియేటర్ల వద్ద జనాల సందడి కూడా తక్కువగా ఉంది. అందుకే పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత మాత్రమే బాలీవుడ్ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు వారికి సౌత్ సినిమా లు దిక్కు అయ్యాయి.
పుష్ప సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ సినిమా స్టార్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాను డబ్బింగ్ చేసి థియేటర్ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కాని ఇప్పటికే రీమేక్ పనులు మొదలు అయ్యి షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది కనుక అల వైకుంఠపురంలో హిందీ డబ్బింగ్ వర్షన్ ను విడుదల చేసే విషయమై కాస్త వివాదం కొనసాగుతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే నేడు హిందీ ప్రేక్షకుల ముందుకు అల వైకుంఠపురంలో సినిమా వెళ్లాల్సి ఉండేది. కాని అల వైకుంఠపురంలో సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ ను విడుదల చేయలేక పోయారు. ఆ సినిమా స్థానంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్షల్ ను హిందీలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మెర్షల్ కు అట్లీ దర్శకత్వం వహించాడు. తెలుగు లో అదిరింది అనే టైటిల్ తో ఈ సినిమా విడుదల అయ్యింది. తెలుగు లో పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా తమిళంలో మాత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకుంది. విజయ్ సినిమాల్లో ఎప్పటిలాగే మెర్షల్ కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకుంది. అప్పట్లోనే ఈ సినిమా ను హిందీలో విడుదల చేస్తే బాగుంటుందని మేకర్స్ భావించారు. కాని రీమేక్ చేయాలనే ఉద్దేశ్యంతో వాయిదా వేశారు. ఇప్పుడు సినిమాలు లేని సమయంలో అరవ అదిరిందిని హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మెర్షల్ సినిమా తో పాటు రామ్ చరణ్ నటించిన సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాను కూడా హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లబోతున్న విషయం తెల్సిందే.