డ్యాన్స్ అనే విషయానికి వస్తే.. ఇండియా మొత్తంలో టాలీవుడ్ హీరోల్ని కొట్టేవాళ్లు లేరిప్పుడు. హిందీలో హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ - వరుణ్ ధావన్ లాంటి మంచి డ్యాన్సర్లున్నారు కానీ.. వాళ్ల సినిమాల్లో డ్యాన్సుల మీద మరీ ఫోకస్ ఏమీ ఉండదు. మిగతా ఇండస్ట్రీల్లో మన హీరోలతో పోల్చుకోవడానికి కూడా పెద్దగా డ్యాన్సర్లు కనిపించరు. మన దగ్గర జూనియర్ ఎన్టీఆర్ - అల్లు అర్జున్ - రామ్ చరణ్ లాంటి మేటి డ్యాన్సర్లున్నారు. వీళ్లలో ఎవరికి వాళ్లే సాటి. ఇంకా రామ్ - నితిన్ లాంటి యువ కథానాయకులూ డ్యాన్సులు ఇరగదీస్తారు. ఇక సీనియర్ల విషయానికి వస్తే చిరు ఒక్కడు చాలు దేశంలోని హీరోలందరికీ సమాధానం చెప్పడానికి. భారతీయ సినీ చరిత్రలోనే బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే చిరునే అని వేరే ఇండస్ట్రీల వాళ్లు కూాడా ఒప్పుకుంటారు. సినిమా నృత్యాన్ని కొత్త పుంతలు తొక్కించి తిరుగులేని స్థాయికి తీసుకెళ్లిన డ్యాన్సర్ చిరు. తారక్, బన్నీ, చరణ్‌లు ఆయన ఘన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
ఐతే ఏ విషయంలో అయినా తమను మించిన వాళ్లు లేరని ఫీలయ్యే అరవ జనాలు.. వేరే వాళ్ల గొప్పదనాన్ని ఎప్పుడూ ఒప్పుకోవడానికి ఇష్టపడరు. తమిళ సినిమాల్లో డ్యాన్సర్లే చాలా తక్కువ. ఉన్నంతలో విజయ్ బాగా డ్యాన్సులేస్తాడు. వాళ్ల ఇండస్ట్రీకి అతనే నంబర్ వన్ డ్యాన్సర్. అంతే కానీ.. మన వాళ్లతో పోల్చుకుంటే అతను పోటీలోనే ఉండడు. ఐతే చర్చ ఎందుకొచ్చిందో ఏమో కానీ.. డ్యాన్స్ విషయంలో విజయ్ ముందు ఎన్టీఆర్ వేస్ట్ అంటూ అరవ జనాలు సోషల్ మీడియాలో అతి చేయడం మొదలుపెట్టారు. ఇద్దరి డ్యాన్సుల్ని పోలుస్తూ వీడియోలు పెట్టారు. ఆ వీడియోలు చూస్తేనే ఎన్టీఆర్ ముందు విజయ్ నిలవలేడని స్పష్టమవుతోంది. కానీ అరవ జనాలు ఒప్పుకుంటారా? మా విజయ్ గ్రేట్ అంటూ.. అతడి డ్యాన్స్ వీడియోలు కుమ్మరించడం మొదలుపెట్టారు. ఐతే వాళ్లకు మనోళ్లు గట్టిగానే సమాధానం చెప్పారు. ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్స్ వీడియోల్ని బయటికి తీసి.. మీ హీరోను ఒకసారి ఈ స్టెప్పులు ట్రై చేయమనండి అంటూ సవాల్ విసిరారు. మామూలుగా ఎన్టీఆర్ ను వ్యతిరేకించే యాంటీ ఫ్యాన్స్ సైతం ఈ గొడవలోకి వచ్చి.. విజయ్ ఫ్యాన్స్ గాలి తీశారు. నిన్నట్నుంచి ట్విట్టర్లో ఈ రగడ పెద్ద ఎత్తున నడుస్తోంది.