గల్ఫ్ దేశాల్లో సెన్సిటివిటీ గురించి తెలిసినదే. అక్కడ శిక్షలు కఠినంగా ఉంటాయి. ఇక భారతదేశం పాకిస్తాన్ నుంచి పారిపోయే ఉగ్రవాదులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గల్ఫ్ లోనే తలదాచుకుంటారని అందుకు అక్కడ చట్టాలు సహకరిస్తాయని కూడా టాక్ ఉంది. దావూద్ ఇబ్రహీం లాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దుబాయ్ లో తలదాచుకునేవాడన్న కథనాలు ఉన్నాయి.
ఇకపోతే ఇప్పుడు ఇదే విజయ్ నటించిన బీస్ట్ కి చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ సినిమా కథాంశం ప్రకారం మాల్ ని హైజాక్ చేసే ఉగ్రవాదులకు గల్ఫ్ కనెక్షన్ ఇవ్వడంతో అక్కడ నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి. బీస్ట్ చిత్రాన్ని కువైట్ లో బ్యాన్ చేయడం సంచలనమైంది. కువైట్ ప్రభుత్వం తలపతి విజయ్ నటించిన మాల్ హైజాక్ డ్రామా బీస్ట్ విడుదలను నిషేధించింది. అయితే UAE వంటి మరికొన్ని అరబ్ దేశాలు ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి అనుమతిని మంజూరు చేశాయి.
బీస్ట్ కథను పరిశీలిస్తే.. చెన్నైలోని ఒక షాపింగ్ మాల్ ను ఉగ్రవాదులు చుట్టుముడతారు. అక్కడ సందర్శకులను బందీలుగా పట్టుకుని హైజాక్ చేస్తారు. మాల్ లో చిక్కుకున్న హీరో విజయ్ ప్రజల్ని కాపాడేందుకు ఏం చేశారన్నదే సినిమా. ఇందులో విజయ్ గూఢచారిగా కనిపిస్తారు. అతడు ఉగ్రవాదులను అంతమొందించి బందీలను ఎలా రక్షించారు? అన్నది తెరపైనే చూడాలి.
అయితే ఈ చిత్రంలో అరబిక్ దేశాలు ప్రోత్సహించని ఇస్లామిక్ టెర్రరిజాన్ని చూపించారు. అరబ్ దేశాలను విలన్లు గా ఉగ్రవాదులకు నిలయంగా చూపించే ఏ సినిమా అయినా సాధారణంగా కువైట్ లో నిషేధించబడుతుంది. గతంలో దుల్కర్ సల్మాన్ చిత్రం కురుప్ కూడా నిషేధానికి గురైంది. ఇప్పుడు బీస్ట్ కి ఇది తప్పలేదు.
తమ దేశంలో ఆశ్రయం పొందుతున్న మెస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని చూపించడాన్ని కువైట్ లాంటి దేశాలు అస్సలు ఇష్టపడవు. అందుకే ఈ పరిస్థితి తలెత్తింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చూడాలని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కువైట్ లోని దళపతి అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది.
అలాగే ఈ బ్యాన్ ఓవర్సీస్ కలెక్షన్లకు కూడా గండి పడుతుందనడంలో సందేహం లేదు. విజయ్ నటించిన సినిమాలు సునాయాసంగా 200 కోట్లు వసూలు చేస్తున్న సంగతి తెలిసినదే. వరుస విజయాలతో దూకుడుమీదున్న అతడు మరో బంపర్ హిట్ కొడతాడనే అంతా భావిస్తున్నారు.