విజయ్ దేవరకొండ గతంలో ఒకసారి పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తి లేదంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆ విషయమై మరోసారి విజయ్ దేవరకొండ స్పందించాడు. ఈ వారంలో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన విజయ్ దేవరకొండ మరోసారి పెళ్లి గురించి మాట్లాడాడు.
ఈ చిత్రంలో మూడు విభిన్నమైన ప్రేమ కథలు ఉన్నాయి కదా.. ఈ చిత్రంలో నటించిన తర్వాత ప్రేమ గురించి మీ అభిప్రాయం ఏంటీ.. పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించిన సమయం లో జీవితంలో పెళ్లి చేసుకుంటాను.. కాని ఇప్పుడు మాత్రం కాదు. నా అభిప్రాయం ప్రకారం నేను ఇంకా పెళ్లికి సిద్దం కాలేదు. నేను ఆ విషయంలో ఇంకా చిన్న పిల్లాడినే అనుకుంటున్నాను అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలోని శీనయ్య పాత్రను చాలా ఎంజాయ్ చేస్తూ చేశానని చెప్పాడు.
ఇలాంటి పాత్రలు వారు కూడా ఉంటారా.. ఇలాంటి ఫ్యామిలీ బాధ్యతలతో సామాన్యులు ఉంటారా అనిపించింది. ఆ పాత్ర గురించి చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యానంటూ రౌడీ చెప్పుకొచ్చాడు. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం తర్వాత తాను ప్రేమ కథలను చేయను అంటూ గతంలో ప్రకటించిన ప్రకటనకు కట్టుబడి ఉంటానని.. తనకు ఇప్పట్లో మళ్లీ ప్రేమకథలు చేసే ఆసక్తి లేదంటూ విజయ్ ప్రకటించాడు.