విజయ్ దేవరకొండ క్రేజ్ తగ్గినట్టేనా?

Update: 2019-11-05 11:08 GMT
టాలీవుడ్ లో యువ హీరోలు చాలామందే ఉన్నారు కానీ అతి అతక్కువ సమయంలో యూత్ లో భారీ క్రేజ్ సాధించిన హీరో మాత్రం విజయ్ దేవరకొండ ఒక్కడే. 'అర్జున్ రెడ్డి'.. 'గీత గోవిందం' విజయాలు విజయ్ క్రేజ్ ను పెంచాయి.  విజయ్ స్టార్ హీరో అని..  నెక్స్ట్ లీగ్ కు చేరే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ ఈమధ్య పరిస్థితి చూస్తుంటే ఆ క్రేజ్ తగ్గుతోందేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

'టాక్సీవాలా' మంచి విజయం సాధించినప్పటికీ 'నోటా'.. 'డియర్ కామ్రేడ్' చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ముఖ్యంగా 'డియర్ కామ్రేడ్' ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ పబ్లిక్ ప్లాట్ ఫామ్స్ లో ఎక్కడ కూడా అగ్రెసివ్ గా కనిపించడం లేదు.  తన స్పీచులలో మునుపటి జోష్ కూడా లేదు.  ఇక విజయ్ నిర్మించిన 'మీకు మాత్రమే చెప్తా' సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఏమాత్రం విజయ్ హవా పనిచేసినట్టుగా కనిపించడం లేదు.  విజయ్ పేరు చెప్తే ఊగిపోయే యూత్ నిజంగా ఈ సినిమాను ఎగబడి చూసి ఉంటే ఈ సినిమాకు భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ నమోదు కావాలి.  కానీ ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ చాలా యావరేజ్ గా ఉన్నాయి.

ఈ సినిమాలో విజయ్ నటించలేదు అనే మాట నిజమే కానీ ప్రమోషన్స్ అయితే గతంలో తన సినిమాలకు చేసినట్టే డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు.  అయితే అవి కూడా రొటీన్ అయ్యాయని చాలామంది ఫీల్ అవుతున్నారు.  విజయ్ ప్రమోషన్స్ చేసినా ఈ సినిమా మీద రిలీజ్ కు ముందు పెద్దగా బజ్ రాలేదు.  ఇదంతా చూస్తుంటే విజయ్ క్రేజ్ మెల్లగా తగ్గుతోందనిపిస్తోంది.   విజయ్ నటిస్తున్న నెక్స్ట్ సినిమాలు హిట్ అయితే సరే కానీ లేకపోతే విజయ్ మార్కెట్ కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Tags:    

Similar News